Share News

బిహార్‌లో 3,035 మంది ప్రభుత్వ టీచర్ల తొలగింపు!

ABN , Publish Date - Jul 11 , 2026 | 08:56 PM

బిహార్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన 3,035 మందిని డిస్మిస్ చేసినట్టు జాతీయ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.

బిహార్‌లో 3,035 మంది ప్రభుత్వ టీచర్ల తొలగింపు!
Bihar teachers' dismissal

ఇంటర్‌నెట్ డెస్క్: బిహార్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన 3,035 మందిని డిస్మిస్ చేసినట్టు జాతీయ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా వారికి శాలరీ కింద ఇచ్చిన రూ.1400 కోట్లను వడ్డీతో సహా రికవర్ చేసేందుకు కూడా నిర్ణయించింది.

2006-15 మధ్య కాలంలో టీచర్ రిక్రూట్‌మెంట్‌లో పలు అవకతవకలు జరిగినట్టు తాజా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పట్నా హైకోర్టు ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ జరిపిన దర్యాప్తులో ఈ అవకతవకలు బయటపడ్డాయి. నకిలీ ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికేట్లతో వేల మంది ఉద్యోగాలు పొందినట్టు బయటపడింది. నకిలీ సీటీఈటీ, టీఈటీ సర్టిఫికేట్లతో కూడా జాబ్స్ పొందిన వారు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.


ఈ తొలగింపులు తొలి అడుగు మాత్రమే అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మిథిలేశ్ తివారీ చెప్పారు. ఈ అవకతవకలపై చాలా కాలంగా దర్యాప్తు జరుగుతోందని అన్నారు. ఇటీవలే దర్యాప్తు పూర్తైందని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఘజియాబాద్‌లో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం..

వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు

Updated Date - Jul 11 , 2026 | 09:00 PM