Share News

పల్లెపల్లెకూ భారత్‌‘నెట్‌’ సేవలు

ABN , Publish Date - May 14 , 2026 | 06:23 AM

ఏపీలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చే భారత్‌నెట్‌ కార్యక్రమం(ఏబీపీ) అమలుకు మార్గం సుగమమైంది. బుధవారం ఢిల్లీలోని సంచార్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో...

పల్లెపల్లెకూ భారత్‌‘నెట్‌’ సేవలు

  • ఏపీలో సవరించిన ప్రాజెక్టు అమలుకు ఒప్పందం

  • రూ.2,432 కోట్ల ఆర్థిక సాయానికి కేంద్రం ఆమోదం

  • 13,426 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌!

న్యూఢిల్లీ, మే 13(ఆంధ్రజ్యోతి): ఏపీలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చే భారత్‌నెట్‌ కార్యక్రమం(ఏబీపీ) అమలుకు మార్గం సుగమమైంది. బుధవారం ఢిల్లీలోని సంచార్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో భారత్‌ నెట్‌ ప్రాజెక్టును పటిష్ఠంగా అమలు చేసేందుకు ఐదు ప్రధాన సంస్థలు చేతులు కలిపాయి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిటల్‌ భారత్‌ నిధి(డీబీఎన్‌), టెలికమ్యూనికేషన్ల విభాగం, ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ భారత్‌ నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(ఏపీబీఐఎల్‌), భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎ్‌సఎన్‌ఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ ేస్టట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌) మధ్య ఈ కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. డీబీఎన్‌ అడ్మినిరేస్టటర్‌ శ్యామల్‌ మిశ్రా, టెలికమ్యూనికేషన్స్‌శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆనంద్‌ ఖరే, ఏపీ బీఐఎల్‌ సీఈఓ గీతాంజలి శర్మ, బీఎ్‌సఎన్‌ఎల్‌ డైరెక్టర్‌(ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌) పాపా సుధాకర రావు, టెలికాం శాఖ డీడీజీ దినేశ్‌కుమార్‌ గార్గ్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించి, నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని నిర్ణయించారు. సవరించిన భారత్‌నెట్‌ ప్రాజెక్టు కింద రాష్ర్టానికి రూ.2,432 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులను ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ వేయడానికి, నెట్‌వర్క్‌ పరికరాల కొనుగోలుకు, చివరి అంచె వరకు కనెక్టివిటీని తీసుకెళ్లడానికి వెచ్చించనున్నారు.


ఈ మెగా ప్రాజెక్టు రాష్ట్రంలోని మొత్తం 13,426 గ్రామ పంచాయతీలను కవర్‌ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 480 గ్రామ పంచాయతీలను ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావడం విశేషం. దీనితోపాటు పంచాయతీ కార్యాలయాలే కాకుండా, అదనంగా 3,942 గ్రామాలకు ప్రజల డిమాండ్‌ మేరకు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పించనున్నారు. సుమారు 5 లక్షలకు పైగా గ్రామీణ గృహాలకు నేరుగా ఫైబర్‌ కనెక్షన్లు (ఎఫ్‌టీటీహెచ్‌) అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పల్లెల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారస్తులు పట్టణాలతో సమానంగా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ ేసవలను పొందగలుగుతారు. భారత్‌నెట్‌ రాకతో రాష్ట్రంలోని ఇ-గవర్నెన్స్‌ సేవలూ మరింత వేగవంతం కానున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 06:23 AM