బెంగళూరులో దారుణం.. అప్పు తీర్చలేదని మహిళను నడిరోడ్డుపై..
ABN , Publish Date - Sep 05 , 2026 | 08:34 AM
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అప్పు కట్టలేదన్న కోపంతో మహిళపై ఘాతుకానికి ఒడిగట్టారు కొందరు వ్యక్తులు. మహిళను వివస్త్రను చేసి కొట్టారు. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో కూడా చిత్రీకరించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అప్పు కట్టలేదన్న కోపంతో మహిళపై ఘాతుకానికి ఒడిగట్టారు కొందరు వ్యక్తులు. మహిళను వివస్త్రను చేసి కొట్టారు. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో కూడా చిత్రీకరించారు. అప్పు తీర్చకపోతే వీడియోను ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరించారు. మహిళపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన బాధితురాలు.. రేష్మ అనే మహిళ నుంచి కొన్ని నెలల క్రితం 50 వేల రూపాయల అప్పు తీసుకుంది.
ప్రతినెల 5 వేల రూపాయలు చెల్లించేది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ నాలుగు వారాల పాటు ఆమె డబ్బులు కట్టలేదు. రేష్మ తనను వేధిస్తుందేమోనని భయపడిపోయిన బాధితురాలు.. రేష్మ ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేయటంతో పాటు వేరే ఇంటికి మారిపోయింది. రెండు రోజుల క్రితం నజ్రత్ అనే మహిళ బాధితురాలికి ఫోన్ చేసింది. పనితో పాటు కొంత డబ్బు కూడా ఇప్పిస్తానని చెప్పింది. బాధితురాలు నజ్రత్ ఇంటికి వెళ్లగా.. సొహైల్ అనే వ్యక్తి బాధితురాలిపై దాడి చేశాడు.
నజ్రత్, సోహైల్, రేష్మ, సైఫ్.. బాధితురాలిని కుంబల్‌గోడులోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దారుణాన్ని వీడియో తీశారు. వీలైనంత త్వరగా డబ్బులు కట్టకపోతే వీడియోను ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరించారు. బాధితురాలి తల్లి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి