Share News

బెంగళూరులో వర్ష బీభత్సం

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:23 AM

బెంగళూరు నగరంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం నగర వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులతో వడగండ్ల వాన...

బెంగళూరులో వర్ష బీభత్సం

  • ఏడుగురి మృతి.. 10 మందికి గాయాలు

బెంగళూరు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం నగర వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసింది. వందలాది చెట్లు నేలకొరిగాయి. మెజస్టిక్‌ ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌ వద్ద భారీ చెట్టు కూలడంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ వర్షానికి శివాజీ నగర్‌లోని బౌరింగ్‌ ఆసుపత్రి ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ శిథిలాల కింద చిక్కుకుని ఏడుగురు మృతిచెందారు. పదిమందికిపైగా గాయపడ్డారు. శివాజీ నగర్‌ బస్టాండ్‌ నుంచి సెయింట్‌ బసిలికా చర్చ్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ఒకవైపు సుమారు 10 అడుగుల ఎత్తున ఈ ప్రహరీ ఉంది. ఇటీవలే దీని మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో గోడకు ఓవైపు మట్టి ఉండటంతో వర్షపు ధాటికి అది కూలిపోయినట్లు భావిస్తున్నారు. ఫుట్‌పాత్‌ వ్యాపారులు ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం ప్రహరీ పైనుంచి షేడ్‌ వేసుకున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో వ్యాపారులు, పాదచారులు వాటి కింద నిలబడిన సమయంలో ప్రమాదం జరగడంతో మరణాల సంఖ్య పెరిగింది. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం సిద్దరామయ్య రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 05:23 AM