Share News

డేటింగ్ యాప్ స్కామ్.. అమ్మాయి ఫొటో చూసి మోసపోయిన యువకుడు..

ABN , Publish Date - Sep 02 , 2026 | 09:27 AM

డేటింగ్ యాప్ ఓ యువకుడి కొంపముంచింది. యాప్‌లో అమ్మాయి ఫొటో చూసి డేటింగ్ మొదలెట్టిన ఆ యువకుడు స్కామ్‌కు గురయ్యాడు. నేరగాళ్లు తెలివిగా అతడి వద్ద నుంచి వేల రూపాయలు దోచేశారు.

డేటింగ్ యాప్ స్కామ్.. అమ్మాయి ఫొటో చూసి మోసపోయిన యువకుడు..
Bengaluru dating scam

ఇంటర్‌నెట్ డెస్క్: డేటింగ్ యాప్ ఓ యువకుడి కొంపముంచింది. యాప్‌లో అమ్మాయి ఫొటో చూసి డేటింగ్ మొదలెట్టిన ఆ యువకుడు స్కామ్‌కు గురయ్యాడు. నేరగాళ్లు తెలివిగా అతడి వద్ద నుంచి వేల రూపాయలు దోచేశారు. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత యువకుడు రెడ్డిట్‌లో తనకు జరిగిన మోసంపై ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో ఏం జరిగిందో వివరించాడు.
shelly.jpg


‘డేటింగ్ యాప్ ద్వారా షెల్లీ అనే అమ్మాయితో డేటింగ్ మొదలెట్టాను. కొన్ని రోజుల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నాము. ఆఫీస్ వర్క్ కారణంగా ఆమెను నేరుగా కలవలేకపోయాను. కానీ, తరచుగా ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. ఆఫీస్ వర్క్‌ నుంచి విరామం దొరకటంతో ఆమెను కలవాలని అనుకున్నాను. ఆమెకు ఫోన్ చేసి కలుద్దామన్నాను. ‘నేను ఓ సిగరెట్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టాను. దాన్ని నువ్వు డెలివరీ తీసుకో’ అని ఆమె చెప్పింది. రాన్ అనే వ్యక్తి ఫోన్ నంబర్ ఇచ్చింది. అతడికి ఆన్‌‌లైన్‌లో డబ్బులు పంపిస్తే.. తాను స్వయంగా వచ్చి డబ్బులు ఇస్తానని ఆమె చెప్పింది. నాకు కొంచెం విచిత్రంగా అనిపింది’..

dating-app-scam.jpg


‘మా అమ్మ బిజినెస్ చేస్తోంది. మా దగ్గర ఆన్‌లైన్ క్యాష్ కంటే నగదు ఎక్కువగా ఉంది’ అని చెప్పింది. నేను ఆమె మాటలు నమ్మక తప్పలేదు. ఆమె ఇచ్చిన నంబర్‌ను సంప్రదించాను. ఆన్‌లైన్ ద్వారా అతడికి కొంత డబ్బులు పంపాను. తర్వాతి నుంచి ఇద్దరూ నా నంబర్ బ్లాక్ చేశారు. నన్ను మోసం చేయడానికి చాలా పక్కాగా ప్లాన్ వేశారు. ఎంతో జాగ్రత్తగా వాళ్లు మనుషుల్ని ఫూల్స్ చేసి, డబ్బులు దోచేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి

బాబర్ ఆజమ్‌కు జ్వరం.. పాక్ జట్టులో మరింత గందరగోళం!

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. వ్యాపారవేత్త ఇంట్లో వజ్రాభరణాలు మాయం

Updated Date - Sep 02 , 2026 | 09:47 AM