ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. యువతిని పార్టీకి పిలిచి..
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:02 PM
ఇన్‌స్టాగ్రామ్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు, అతడి స్నేహితుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది..
బెంగళూరు, ఫిబ్రవరి 23: ఇన్‌స్టాగ్రామ్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు, అతడి స్నేహితుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి.. చదువు నిమిత్తం 5 నెలల క్రితం బెంగళూరు వచ్చింది. ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆ యువతికి ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల డిక్సన్ శాండోతో పరిచయం ఏర్పడింది.
ఇద్దరూ తరచూ టచ్‌లో ఉండేవారు. కొన్నిసార్లు బయట నేరుగా కలుసుకునేవారు. ఫిబ్రవరి 14వ తేదీన డిక్సన్ నుంచి ఆ యువతికి ఫోన్ వచ్చింది. ఫిబ్రవరి 15వ తేదీన జరిగే పార్టీకి డిక్సన్ ఆమెను ఆహ్వానించాడు. దీంతో ఆ యువతి తన స్నేహితురాలితో కలిసి పార్టీకి వెళ్లింది. పార్టీ సందర్భంగా డిక్సన్, అతడి స్నేహితుడు నిఖిల్ బలవంతంగా ఆమెతో పింక్ కలర్ ట్యాబ్లెట్ తినిపించారు. తర్వాత ఆమె మైకంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే, యువతి ధైర్యం చేసి ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యువతి కంటే ముందే ఫిర్యాదు..
యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఒక రోజు ముందే నిందితులు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 21వ తేదీన యువతిపై కంప్లైంట్ ఇచ్చారు. ఆ యువతి ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి తమపై బెదిరింపులకు పాల్పడుతోందని, డబ్బులు డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయటంపై యువతి స్పందించింది. ‘ఫిబ్రవరి 17వ తేదీన బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను. తర్వాత నా సోదరుడికి ఈ విషయం చెప్పాను. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
హెరిటేజ్‌పై ఫేక్ ప్రచారం.. జగన్ అండ్ కో పై మంత్రి లోకేశ్ ధ్వజం
పీరియడ్స్ సమయంలో ఏం తినాలో తెలుసా?