Share News

పీరియడ్స్‌ సమయంలో ఏం తినాలో తెలుసా?

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:21 PM

పీరియడ్స్ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవడం వల్ల నొప్పి, అలసట తగ్గి శరీరానికి శక్తి అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పీరియడ్స్‌ సమయంలో  ఏం తినాలో తెలుసా?
Menstrual Health Tips

ఇంటర్నెట్ డెస్క్: పీరియడ్స్ సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. అందువల్ల తీవ్రమైన కడుపు నొప్పి, అలసట, బలహీనత, చిరాకు వంటి సమస్యలు రావచ్చు. కొంతమందికి తలనొప్పి, వెన్నునొప్పి కూడా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకుంటే నొప్పి తగ్గుతుంది, శరీరానికి శక్తి వస్తుంది.


తినాల్సిన ఆహార పదార్థాలు..

  • పీరియడ్స్ సమయంలో రక్తం కోల్పోతారు కాబట్టి, ఐరన్ ఫుడ్స్ తీసుకోవాలి. ఆకుకూరలు, బీట్‌రూట్, దానిమ్మ, పప్పులు వంటివి రక్తహీనత రాకుండా కాపాడతాయి.

  • అలాగే.. కాల్షియం, మెగ్నీషియం ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, బాదం, నువ్వులు.. వంటివి కడుపు నొప్పి తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాకుండా అరటిపండ్లు, ఓట్స్ కూడా తీసుకోవడం మంచిది. ఇవి అలసటను తగ్గించి శరీరానికి శక్తినిస్తాయి.

  • శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజంతా తగినంత నీరు తాగాలి. సూప్‌లు, ఇంట్లో తయారుచేసిన తేలికపాటి ఆహారం తీసుకోవాలి.


తినకూడని ఆహార పదార్థాలు..

  • ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం

  • వేయించిన, కారంగా ఉండే పదార్థాలు

  • ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు

  • ప్యాకెట్ స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారం

  • అదే పనిగా కాఫీ, టీ తాగకూడదు. శీతల పానీయాలు తీసుకోకూడదు.


పీరియడ్స్ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం తింటే నొప్పి తగ్గి, శరీరం బలంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో జంక్ ఫుడ్‌ను దూరంగా ఉంచి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?

పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

For More Latest News

Updated Date - Feb 23 , 2026 | 04:44 PM