క్రిమినల్స్‌కు చుక్కలు చూపిస్తున్న పశ్చిమ బెంగాల్ పోలీసులు.. గూండాలను అర్ధనగ్నంగా రోడ్లపై..
ABN , Publish Date - May 28 , 2026 | 07:06 AM
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు క్రిమినల్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. క్రిమినల్స్‌ను అర్ధనగ్నంగా నడిరోడ్లపై తిప్పుతున్నారు.
కోల్‌కతా, మే 28: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు క్రిమినల్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. క్రిమినల్స్‌ను అర్ధనగ్నంగా నడిరోడ్లపై తిప్పుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారం మారిన నాటి నుంచి పోలీసులు క్రిమినల్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఆ తర్వాత వారిని అర్ధనగ్నంగా లోదుస్తులపై రోడ్ల మీద తిప్పుతున్నారు. అది కూడా వారు ఏ జనాలను అయితే భయపెట్టారో.. ఆ ప్రదేశాల్లో అర్ధనగ్నంగా తిప్పుతున్నారు.
గతంలో ఆ క్రిమినల్స్‌కు ఎదురు తిరగాలన్నా.. వారి గురించి గట్టిగా మాట్లాడాలన్నా జనం భయపడేవారు. పోలీసులు చేస్తున్న ఈ పనితో జనంలో ధైర్యం వచ్చింది. క్రిమినల్స్ గురించి పబ్లిక్‌లో గట్టిగానే మాట్లాడుతున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య హౌరాలో పోలీసులు క్రిమినల్స్‌ను రోడ్లపై తిప్పుతున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఉత్తర హౌరాలో ఆకాశ్ సింగ్ అనే లోకల్ డాన్ జనాలను తీవ్రంగా భయపెట్టేవాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన తర్వాత గుండు కొట్టించారు. బనియర్, డ్రాయర్‌పై వీధుల్లో తిప్పారు. అతడు ఏ వీధుల్లో అయితే నేరాలకు పాల్పడ్డాడో ఆ వీధుల్లో అతడిని తిప్పారు.
పోలీసులు చేసున్న ఈ పనితో జనాల్లో ధైర్యం వచ్చింది. తమపై అక్రమాలకు పాల్పడిన, పాల్పడుతున్న వ్యక్తులపై ఎదురు తిరుగుతున్నారు. క్రిమినల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. క్రిమినల్స్‌ను అర్ధనగ్నంగా రోడ్లపై తిప్పటం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘క్రిమినల్స్‌కు గట్టి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజల్లో భయం పోగొట్టడం కూడా ఇందులో భాగమే. ప్రజలు ఎలాంటి భయం లేకుండా జీవించాలన్న లక్ష్యంతోటే ఈ పని చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం