మోదీకి ‘ఇండియా గేట్’ చాక్లెట్ ఇవ్వాలనుకున్నా..
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:14 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేకమైన కానుక ఇవ్వాలని భావించినట్లు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ తెలిపారు. అత్యుత్తమ బెల్జియం చాక్లెట్లతో తయారుచేసిన ‘ఇండియా గేట్’ ప్రతిరూపాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు.
ద్వైపాక్షిక సమావేశంలో బెల్జియం ప్రధాని
న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేకమైన కానుక ఇవ్వాలని భావించినట్లు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ తెలిపారు. అత్యుత్తమ బెల్జియం చాక్లెట్లతో తయారుచేసిన ‘ఇండియా గేట్’ ప్రతిరూపాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు. అయితే ప్రయాణంలోనే ఆ చాక్లెట్ దెబ్బతిని భారత్‌కు చేరుకునేలోపే పాడైపోయిందని వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ ఆసక్తికర విషయాన్ని బార్ట్ స్వయంగా తెలిపారు. ‘‘నిజమైన ఇండియా గేట్ శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా నిలబడింది. కానీ చాక్లెట్‌తో చేసిన ఇండియా గేట్ మాత్రం భారత్‌కు చేరుకునేలోపే కరిగిపోయింది. దౌత్యపరమైన సంబంధాలకు చాక్లెట్లు బాగుంటాయి. కానీ దౌత్య ప్రయాణాలకు కాదని అర్థమైంది’’అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో మోదీతో సహా సమావేశంలో ఉన్నవారంతా నవ్వులు చిందించారు. అయితే మరో ‘ఇండియా గేట్’ చాక్లెట్ బెల్జియంలో సురక్షితంగా ఉందని, త్వరలోనే దానిని మోదీకి అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రధానులు రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, ఫిన్‌టెక్, క్లీన్ ఎనర్జీ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.
ఇవి కూడా చదవండి
ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై వేటు.. పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు..
ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎం రేవంత్ పగబట్టారు: హరీశ్ రావు