Share News

చర్చలు విఫలం28 నుంచి 3 రోజులు బ్యాంకు యూనియన్ల సమ్మె

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:10 AM

డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌తో మంగళవారం జరిపిన చర్చలు విఫలమవడంతో ఈ నెల 28 నుంచి మూడు రోజులు దేశవ్యాప్త సమ్మె జరపనున్నట్లు యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌(యూఎఫ్ బీయూ ) ప్రకటించింది.

చర్చలు విఫలం28 నుంచి 3 రోజులు   బ్యాంకు యూనియన్ల సమ్మె
bank

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌తో మంగళవారం జరిపిన చర్చలు విఫలమవడంతో ఈ నెల 28 నుంచి మూడు రోజులు దేశవ్యాప్త సమ్మె జరపనున్నట్లు యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌(యూఎఫ్ బీయూ ) ప్రకటించింది. వారానికి ఐదు రోజుల పని విధానంతోపాటు పలు ససమ్యలు పరిష్కరించాలని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి. కాగా సమ్మెకు ముందు శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. 28 నుంచి 30 వరకు యూనియన్ల సమ్మె కారణంగా మూతపడతాయి. దీంతో మొత్తం ఐదు రోజులు బ్యాంకుల సేవలకు అంతరాయం కలగనుంది. ఐదు రోజుల పని విధానం ప్రవేశ పెట్టే దిశగా సానుకూల పరిణామాలు కనిపిస్తేనే సమ్మె వాయిదా గురించి ఆలోచిస్తామని యూఎప్‌బీయూ ప్రకటించింది.

ఈ వార్తలను చదవండి

వీధిలో డీజే.. గుండెపోటుతో 2వ తరగతి బాలిక మృతి

వైభవంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు చిత్రాలకు 9 అవార్డులు

Updated Date - Sep 23 , 2026 | 04:10 AM