Share News

బంగ్లాలో హిందువులపై ఆగని హత్యాకాండ

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:08 AM

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. దీపూ చంద్రదాస్‌ హత్యతో మొదలై గత 45 రోజుల్లో ఏకంగా 15మంది హిందువులు...

బంగ్లాలో హిందువులపై ఆగని హత్యాకాండ

  • తాజాగా మరో టీ తోట కార్మికుడు బలి

ఢాకా, ఫిబ్రవరి 12: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. దీపూ చంద్రదాస్‌ హత్యతో మొదలై గత 45 రోజుల్లో ఏకంగా 15మంది హిందువులు హత్యకు గురి కాగా, దాదాపు 51మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఈశాన్య బంగ్లాదేశ్‌లోని మౌల్వీబజార్‌ ప్రాంతంలో 28 ఏళ్ల రతన్‌ శువోకర్‌ అనే టీ తోట కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం స్థానిక టీ తోటలో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న రతన్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బంగ్లాలో సార్వత్రిక ఎన్నికల వేళ, 24గంటల వ్యవధిలో జరిగిన రెండో హిందూ హత్య ఇది. అంతకుముందు సోమవారం మైమెన్‌సింగ్‌ అనే వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు అతని దుకాణంలోనే నరికి చంపారు.

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 06:08 AM