రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:21 AM
పాక్ సర్కారుకు బలూచిస్థాన్ ఉద్యమకారులు షాకిచ్చారు. పాకిస్థాన్ నుంచి వేరుపడేందుకు దశాబ్దాలుగా పోరాడుతున్న ఉద్యమకారులు.. బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా (రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్) ప్రకటించుకుంటూ...
స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న పాక్
ప్రావిన్స్.. సొంత కరెన్సీ కూడా విడుదల
న్యూఢిల్లీ, జూలై 14: పాక్ సర్కారుకు బలూచిస్థాన్ ఉద్యమకారులు షాకిచ్చారు. పాకిస్థాన్ నుంచి వేరుపడేందుకు దశాబ్దాలుగా పోరాడుతున్న ఉద్యమకారులు.. బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా (రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్) ప్రకటించుకుంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బలూచిస్థాన్‌లో 85ు భూభాగం తమ బలగాల ఆధీనంలో ఉన్నట్టు పేర్కొన్నారు. ‘మా చుకైన్ బలోచని’ పేరుతో జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడమే కాకుండా.. దేశ కరెన్సీగా ‘బలోచి ఫాల్‌స’ను ఖరారు చేసుకున్నారు. తమ భూభాగంలోని బంగారం, రాగి గనులు, 150కు పైగా గ్యాస్ క్షేత్రాలు, 1,200 బొగ్గు గనులపై తమ నియంత్రణే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘భారీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకులు, మిసైళ్లు లేకపోవచ్చు. కానీ, 5లక్షల మందితో కూడిన సైన్యం, నావికాదళం, వాయు బలగాలతో మా ప్రాంతం నుంచి పాకిస్థాన్ దళాలను ఈ ఏడాది చివరికల్లా తరిమికొట్టగలం’’అని ఈ ప్రకటన పేర్కొంది. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. భౌగోళికంగా బలూచిస్థాన్ పాకిస్థాన్‌లోనే అతిపెద్ద రాష్ట్రం(ప్రావిన్స్). దాదాపు 44ు భూభాగం ఈ ప్రాంతం పరిధిలోనే ఉంటుంది. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దులతో వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. బంగారం, రాగితోపాటు, సహజవాయువు వనరులు సమృద్ధిగా కలిగిన ప్రాంతం ఇది. అయినప్పటికీ దశాబ్దాలుగా అక్కడి ప్రజలు పేదరికాన్నే అనుభవిస్తున్నారు. 1947లో భారత్‌దేశ విభజన నాటికి.. బలూచిస్థాన్‌లో కలాత్ ఖనాట్ అనే స్వతంత్ర రాజ్యం ఉండేది. దాన్ని 1948లో పాక్ బలవంతంగా కలిపేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు
రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!