సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:59 PM
ఆగస్టు 12వ తేదీ (బుధవారం) ఆషాఢ అమావాస్య. ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది భారత్‌లో కనిపిస్తుందా? అంటే కనిపించదు. మొత్తం 55 దేశాల్లో సంపూర్ణంగా కనిపిస్తుంది. 33 దేశాల్లో పాక్షికంగా కనిపిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 12వ తేదీ (బుధవారం) ఆషాఢ అమావాస్య. ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది భారత్‌లో కనిపిస్తుందా? అంటే కనిపించదు. మొత్తం 55 దేశాల్లో సంపూర్ణంగా కనిపిస్తుంది. 33 దేశాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. స్టేషన్ నోర్డ్, సఫ్ర్జూర్, బోర్గార్నాస్ , రెక్జావిక్, కెఫ్లావ్క్, సాన్టాండర్, బిల్బావో, గిజోన్, ఒవిడో, విటోరియా గస్టీజ్, ఎ కొరువా, లుగో, లోగ్రూ, బుర్గోస్, పోన్‌ఫెరాడా, జరాగో తదితర దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహం కనిపిస్తుంది. ఐరోపాలోని పలు ప్రాంతాలు, వాయువ్య ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని కొన్ని భాగాల్లో పాక్షికంగా గ్రహణం కనిపిస్తుంది.
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఎందుకు అరుదైనదంటే..?
ఈ గ్రహణం అసాధారణమైనదని ఐరోపాలోని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్పెయిన్‌తో సహా ఐరోపా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యాస్తమయానికి దగ్గరగా ఈ గ్రహణం సంభవిస్తుంది. దీని వల్ల సాయంకాలం ఆకాశంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణాన్ని వీక్షించే వారు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గ్రహణం పట్టిన సూర్యుడిని నేరుగా చూడటం వల్ల కంటికి నష్టం జరిగే అవకాశం అధికంగా ఉంటుంది.
గ్రహణ సమయం..
పాక్షిక గ్రహణ ప్రారంభం: సాయింత్రం 7.00 గంటలకు
సంపూర్ణ గ్రహణ ప్రారంభం: రాత్రి దాదాపు 9.15 గంటలకు.
గరిష్ఠ గ్రహణం: రాత్రి 11.17 గంటలకు.
సంపూర్ణ దశ ముగింపు: రాత్రి 1.20 గంటలకు (ఆగస్టు 13వ తేదీ)
గ్రహణం ముగింపు: తెల్లవారుజామున 3.30 గంటలకు.
భారత్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడ కనిపిస్తుందంటే..?
భారత్‌లో 2034, మార్చి 20న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది ఆసియా అంతటా కొనసాగే ముందు భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది.