ఏసీపీపై వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టుపై అట్రాసిటీ కేసు!
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:59 AM
జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఈ నెల 3న జంతర్మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఓ ఏసీపీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించిన మహిళా జర్నలిస్టుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది
న్యూఢిల్లీ, అక్టోబరు 14 : జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఈ నెల 3న జంతర్మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఓ ఏసీపీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించిన మహిళా జర్నలిస్టుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సదరు మహిళా జర్నలిస్టు ఎవరిపై ఆరోపణలు చేశారో.. ఆ ఏసీపీ వివేక్ భగత్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సదరు మహిళా జర్నలిస్టు బహిరంగ ప్రదేశంలో తన పట్ల కులదూషణకు పాల్పడ్డారని వివేక్ భగత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీజేపీ నేతలు దీప్కే, సౌరవ్, అశుతోష్ పేర్లను కూడా చేర్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
విదేశాల్లో భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నాం.. కేంద్రం స్పష్టీకరణ
తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా, సీజేపీ నేతలపై ఏసీపీ ఫిర్యాదు!