Share News

అసోంలో కొత్త పూల జాతి మొక్క

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:12 AM

క్యాన్సర్‌ ఔషధాల తయారీలో ఉపయోగించే క్యాంప్టోథెసిన్‌ అనే సమ్మేళనాన్ని కలిగి ఉన్న ఒక కొత్త పూలజాతి మొక్క ఒక టి.. అసోంలో వెలుగుచూసింది

అసోంలో కొత్త పూల జాతి మొక్క
Assam New Plant

క్యాన్సర్ ఔషధాల తయారీలో ఉపయోగించే

‘క్యాంప్టోథెసిన్‌’ను కలిగి ఉండే ప్రజాతికి చెందినది

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: క్యాన్సర్‌ ఔషధాల తయారీలో ఉపయోగించే క్యాంప్టోథెసిన్‌ అనే సమ్మేళనాన్ని కలిగి ఉన్న ఒక కొత్త పూలజాతి మొక్క ఒక టి.. అసోంలో వెలుగుచూసింది. అసోంలోని గిరిజానంద చౌదరి వర్సిటీ వృక్ష శాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బిరినా భుయాన్‌, గువాహటికి చెందిన వృక్షశాస్త్రవేత్త సలీమ్‌ మెహ్మూద్‌ ఈ మొక్కను కనుగొన్నారు. దానికి వారు ఓపియోర్హిజా అస్సామెన్సిస్‌ అని పేరు పెట్టారు. అసోంలోని కామరూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లా, సతార్‌గావ్‌లో.. చెట్ల నీడలో పెరిగే ఈ మొక్క గురించి స్థానికులకు మాత్రమే తెలుసు. అది ఇంతకుముందు ఎవరూ అధికారికంగా గుర్తించని ఒక కొత్త జాతి అని బిరినా భుయాన్‌, సలీమ్‌ మెహ్మూద్‌ తెలిపారు. ఈ మొక్కపై వారు రూపొందించిన పరిశోధన పత్రం.. అంతర్జాతీయ ట్యాక్సానమీ జర్నల్‌ ‘ఫైటోటాక్సా’లో ప్రచురితమైంది.

Updated Date - Sep 07 , 2026 | 04:12 AM