అన్ని వస్తువుల వాడకం తగ్గించాలి: అశ్వినీ వైష్ణవ్
ABN , Publish Date - May 12 , 2026 | 05:17 AM
పశ్చిమాసియా యుద్ధం విషయంలో ఇప్పట్లో సంధి కుదిరేలా కనిపించడం లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు....
న్యూఢిల్లీ, మే 11: పశ్చిమాసియా యుద్ధం విషయంలో ఇప్పట్లో సంధి కుదిరేలా కనిపించడం లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దేశ పౌరులు ఇంధనం సహా అన్ని వస్తువుల వాడకాన్ని తగ్గించి.. విదేశీ మారక నిల్వలను పరిరక్షించేందుకు కృషి చేయాలని కోరారు. ‘‘రెండు దేశాల మధ్య యుద్ధంతో మన ప్రమేయం లేకుండానే మనం ఇబ్బందులు పడుతున్నాం. దీని ప్రభావం మొత్తం ప్రపంచంపై ఉంది. ప్రస్తుత పరిణామాలను బట్టి ఇప్పట్లో సంధి కుదిరేలా కనిపించడంలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలపైనా ఎంతో బాధ్యత ఉంది. ప్రధాని మోదీ కూడా ఇదే అంశంపై అప్పీలు చేశారు’’ అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కాగా, ప్రజలు పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకుంటే దేశానికి ఆర్థికభారం నుంచి ఉపశమనం లభిస్తుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖల జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అన్నారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్