యువకులకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దిశానిర్దేశం
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:28 PM
నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా యువతకు ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో దిశానిర్దేశం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా యువతకు ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో దిశానిర్దేశం చేశారు. ఎవరిపైన అయినా మనసు పడితే ముందుగా పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని యువకులకు ఆయన సూచించారు. ఆ తరువాతే ఆమెకు ఐ లవ్ యూ చెప్పాలని అన్నారు. సెటిల్ అయ్యే వరకూ పెళ్లి చేసుకోబోమని భీష్మించుకుని కూర్చుంటున్న యువతకు కూడా జీవిత సత్యం చెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లయ్యాకే సెటిల్మెంట్ వస్తుందని అన్నారు. తన గడ్డం నెరిసిపోయినా ఇంకా సెటిల్ కాలేదంటూ యువత ఆలోచనల్లో పొరపాటును ఎత్తి చూపారు.
‘భార్యకు ఐ లవ్ యూ చెప్పాలని మేము ఎప్పుడూ చెబుతూ ఉంటాము. ఇక పెళ్లికాని యువకులకు నేను చెప్పేదేంటంటే.. మీరు నచ్చిన అమ్మాయిని ముందు పెళ్లి చేసుకుని ఆ తరువాతే ఐ లవ్ యూ అని చెప్పండి’ అని అన్నారు. సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటామని అనే వారికి కూడా చురకలు అంటించారు. ‘బ్రదర్స్.. చూడండి.. నా గడ్డం ఇంత నెరిసిపోయినా ఇప్పటికీ నేను సెటిల్ కాలేదు. పెళ్లయ్యాకే సెటిల్మెంట్ వస్తుంది. అన్ని అవే సెట్ అవుతాయి’ అని చెప్పారు. ‘తమ కంటూ తోడు లేని వారితో పక్కవారికి సమస్యలు వస్తున్న విషయం మీరంతా చూస్తూనే ఉన్నారుగా’ అని కామెంట్ చేయడంతో అక్కడున్న వారంతా గొల్లున నవ్వారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక.. జైపూర్లో అత్యవసర ల్యాండింగ్
సీజేపీ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్య: ఎంపీ రాహుల్ గాంధీ