Share News

మోదీ 24 ఏళ్లుగా నిర్మించుకున్న ఇమేజీ రెండు వారాల్లో ధ్వంసమైంది

ABN , Publish Date - Aug 05 , 2026 | 06:09 AM

ప్రధాని మోదీ 24 ఏళ్లుగా నిర్మించుకున్న ఇమేజీని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలోని యువత కేవలం రెండు వారాల్లో ధ్వంసం చేసిందని, ఇది ఏ ఎన్నికల విజయం కంటే కూడా గొప్ప విజయమని...

మోదీ 24 ఏళ్లుగా నిర్మించుకున్న ఇమేజీ రెండు వారాల్లో ధ్వంసమైంది

  • బొద్దింకలు ఆ పని చేశాయి: అరుంధతీ రాయ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ప్రధాని మోదీ 24 ఏళ్లుగా నిర్మించుకున్న ఇమేజీని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలోని యువత కేవలం రెండు వారాల్లో ధ్వంసం చేసిందని, ఇది ఏ ఎన్నికల విజయం కంటే కూడా గొప్ప విజయమని ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్‌ పేర్కొన్నారు. తన తల్లి మేరీరాయ్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ అరుంధతీ రాయ్‌ రాసిన ‘మదర్‌ మేరీ కమ్స్‌ టు మీ’ పుస్తకం హిందీ అనువాదం ‘మెరీ మా, మెరీ గ్యాంగ్‌స్టర్‌’ ఆవిష్కరణ సభ ఢిల్లీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌’లో జరిగింది. సభికులతో కిక్కిరిసిన ఆ సభను ఉద్దేశించి అరుంధతి మాట్లాడారు. ‘మనకుగానీ, దేశానికిగానీ ఏం జరగబోతోందో ఎవరికీ తెలియని సమయం. స్ర్కిప్టు పూర్తిగా రాసేశారు. ఈ పరిస్థితుల్లోనే మరో వెయ్యేళ్లు బతకాల్సి ఉంటుందని జనం నమ్మసాగారు. కానీ, రెండు వారాల్లోనే ఈ పరిస్థితులు మూలాల నుంచి కదిలిపోయాయి. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ, కనీసం ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించకుండా 24 సంవత్సరాలుగా రూపొందించుకున్న(మోదీ) ఇమేజీని, ఆయన ఏకంగా విష్ణువు అవతారం అని కొందరు చెబుతున్న సమయంలో.. బొద్దింకలు రెండు వారాల్లో ధ్వంసం చేశాయి’ అని అరుంధతి రాయ్‌ అన్నారు. యువత ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించిందని, ఎంతో పరిపక్వత చూపిందని పేర్కొన్నారు. జంతర్‌మంతర్‌ నిరసనల నుంచి ప్రతిపక్షాలు పాఠాలు నేర్చుకోవాలని అరుంధతీరాయ్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..

Updated Date - Aug 05 , 2026 | 06:09 AM