ప్రధానికి పెమ్మసాని కృతజ్ఞతలు
ABN , Publish Date - May 01 , 2026 | 06:11 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.1192.16 కోట్ల నిధులను...
న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.1192.16 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధుల్లో మెటీరియల్ కంపోనెంట్‌కు రూ.1123.15 కోట్లు, అడ్మిన్ కంపోనెంట్‌కు రూ.69.01 కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్థి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కేంద్ర నిధులు కీలక పాత్ర పోషిస్తాయని పెమ్మసాని అన్నారు. లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, వారి జీవనోపాధిని బలోపేతం చేస్తాయన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..