ఐ అండ్ పీఆర్‌కు జాతీయ గుర్తింపు
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:38 AM
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినందుకు స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది.
డిజిటల్ కార్పొరేషన్‌కు గోల్డ్ స్కోచ్ అవార్డు
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినందుకు స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది. అదేవిధంగా ఐ అండ్ పీఆర్ ఆధ్వర్యంలోని ఏపీడిజిటిల్ కార్పొరేషన్‌కు గోల్డ్ స్కోచ్ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో శనివారం నాడు ఐ అండ్ పీఆర్ కమిషనర్ తరపున జాయింట్ డైరెక్టర్ సూర్యచంద్రరావు అవార్డు అందుకున్నారు. మీడియా ప్రతినిధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని రూపొందించి అర్హులకు అక్రిడిటేషన్లు జారీ చేయడంలో దేశంలోనే ఏపీ పారదర్శకత ప్రదర్శించింది. ఇది తమ శాఖలో సిబ్బంది సమిష్టి కృషికి దక్కిన గౌరవమని డైరెక్టర్ విశ్వనాథన్ చెప్పారు. డిజిటల్ కార్పొరేషన్ గోల్డ్ అవార్డును సంస్థ ఈడీ రాణి సుస్మిత స్వీకరించారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు