Share News

మొఘలుల నాటి లూటీతో పోలిస్తే విరాళాల చోరీ చిన్న అంశం: అనుపమ్ ఖేర్

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:33 PM

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఉదంతంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.

మొఘలుల నాటి లూటీతో పోలిస్తే విరాళాల చోరీ చిన్న అంశం: అనుపమ్ ఖేర్
Anupam Kher

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఉదంతంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ పలు కామెంట్స్ చేశారు. శతాబ్దాల క్రితమే మొఘలుల కాలంలో అసలైన దోపిడీ జరిగిందని అన్నారు. ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేశారని అన్నారు. ఆ కాలంలో మహిళలపై కూడా ఎన్నో దారుణాలు జరిగాయని అన్నారు. నాటి ఘటనలతో పోలిస్తే ప్రస్తుతం ఆయోధ్య విరాళాల విషయంలో వస్తున్న ఆరోపణలు స్వల్పమని వ్యాఖ్యానించారు. నాటి కష్టాలనే భారత్ అధిగమించగలిగిందని చెప్పారు.


అయితే, ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుత పరిస్థితులకు చరిత్రతో ముడిపెట్టడంపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అసంబద్ధమైన వాదన అని అన్నారు. మరికొందరు మొఘలుల పాలనను సమర్థించారు. మొఘల్ పాలనలో కళలు, నిర్మాణ రంగాలకు ప్రోత్సాహం దక్కిందని అన్నారు. 200 ఏళ్ల పాటు ప్రపంచంలో భారత్ ఆర్థిక శక్తిగా నిలిచిందని గుర్తు చేశారు. విరాళాల చోరీ ఉదంతంలో దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను తాజాగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.


ఈ వార్తలనూ చదవండి:

విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు సీరియస్‌

వరుస పేపర్ లీక్‌లపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు.. ఛాత్రోన్ కీ గూంజ్‌కి పిలుపు..

Updated Date - Jul 13 , 2026 | 06:02 PM