Share News

విద్యార్థుల ఆందోళనకు హజారే మద్దతు

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:26 AM

ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మద్దతు పలికారు....

విద్యార్థుల ఆందోళనకు హజారే మద్దతు

  • మహారాష్ట్రలో రెండు గంటల పాటు మౌన వ్రతం

ముంబై, జూలై 23: ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మద్దతు పలికారు. మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో గాంధీ విగ్రహం ఎదుట మౌనవ్రతం పాటించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండు గంటల పాటు ఆయన మౌనవ్రతం పాటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా జరిగిన హింసపై హజారే ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనను శాంతిభద్రతల సమస్యగా చూడరాదని, సమాజ ఆకాంక్షగా చూడాలన్నారు. కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేసినంత మాత్రాన ప్రభుత్వం ఏమీ కూలిపోదని, బదులుగా జవాబుదారీతనం ఏర్పడుతుందని హజారే చెప్పారు. నమ్మకమైన వాతావరణం ఏర్పడేలా చేసి విద్యార్థుల సమస్యలను ఓపికగా విని పరిష్కారాలను కనుగొనాలని హజారే సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 05:26 AM