అనుమతి లేకుండా దేశం వీడి వెళ్లను.. సుప్రీంకోర్టుకు తెలిపిన అనిల్ అంబానీ..
ABN , Publish Date - Feb 19 , 2026 | 08:15 PM
ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఉన్న రూ.40 వేల కోట్ల మోసం కేసుల్లో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. రూ.40 వేల కోట్ల మోసం కేసుల్లో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అనిల్ అంబానీ విదేశాలకు పారిపోయే అవకాశాలు ఉన్నాయని, బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసుల్లో సత్వర, నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూడాలని కోరుతూ మాజీ అధికారి ఈఏఎస్ శర్మ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు (Anil Ambani Supreme Court).
ఈ పిల్‌కు ప్రతిస్పందనగా అనిల్ అంబానీ అఫిడవిట్ దాఖలు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని స్పష్టం చేశారు. రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసుల్లో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. 'ఈ కేసుల్లో దర్యాప్తు మొదలైనప్పటి నుంచి నేను దేశం విడిచి వెళ్లలేదు. ఇప్పటికైతే విదేశాలకు వెళ్లే ఉద్దేశం, ప్లాన్స్ లేవు. ఒకవేళ విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తే కోర్టు నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకుంటాను. సంబంధిత కేసుల దర్యాప్తులో ఏజెన్సీలకు పూర్తిగా సహకరిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాగే సహకరిస్తాను' అని అనిల్ అంబానీ తెలిపారు (Anil Ambani assurance).
చట్ట ప్రక్రియ నుంచి తప్పించుకునే ఉద్దేశం ఏదీ తనకు లేదని, తాను అలాంటి వ్యక్తిని కాదని అనిల్ అంబానీ తెలిపారు (Anil Ambani legal case). అక్రమ నగదు బదిలీ కేసులో ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిందని, తాను ఆ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ కేసుల దర్యాప్తులో జాప్యంపై సుప్రీం కోర్టు ఈ నెల 4వ తేదీన అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు ముమ్మరం చేయాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
ఎముకలు విరగకపోతే నేరం కాదు.. మహిళలకు వ్యతిరేకంగా తాలిబన్ల అమానవీయ చట్టం..
మీ అబ్జర్వేషన్‌కు టెస్ట్.. ఈ కుక్కలకు కావాల్సిన ఎముక ఎక్కడుందో 12 సెకెన్లలో గుర్తించండి..