Share News

నేటి నుంచి అమూల్‌, మదర్‌ డెయిరీల పాల ధర పెంపు

ABN , Publish Date - May 14 , 2026 | 05:27 AM

అమూల్‌ బ్రాండ్‌ పేరుతో పాలను విక్రయించే గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌(జీసీఎంఎంఎఫ్‌) తన పాల ధరను లీటరుకు రెండు రూపాయల ...

నేటి నుంచి అమూల్‌, మదర్‌ డెయిరీల పాల ధర పెంపు

న్యూఢిల్లీ, మే 13: అమూల్‌ బ్రాండ్‌ పేరుతో పాలను విక్రయించే గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌(జీసీఎంఎంఎఫ్‌) తన పాల ధరను లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచింది. అలాగే మదర్‌ డెయిరీ కూడా పాల ధరను లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచింది. ఈ రెండు సంస్థలు పెంచిన ధరలు గురువారం నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వస్తాయి. మదర్‌ డెయిరీ ప్రధానంగా దేశ రాజధాని ప్రాంతంలో పాలను విక్రయిస్తోంది. ఈ ఏడాది పశువుల దాణా, పాల ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌, ఇంధనం ధరలు భారీగా పెరిగిపోవడంతో పాల ధర పెంచినట్లు జీసీఎంఎంఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 05:27 AM