Share News

ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసానికి అమిత్‌ షా..

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:39 PM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్‌ను అమిత్‌ షా ప్రశంసించారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసానికి అమిత్‌ షా..
amit shah praises

న్యూఢిల్లీ, జులై 25: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్‌ను అమిత్‌ షా ప్రశంసించారు. దేశ విద్యా వ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్‌ ఎన్నో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని అన్నారు.


మోదీ, అమిత్ షా అత్యవసర సమావేశం..

ధర్మేంద్ర ప్రధాన్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తదనంతర పరిణామాలు, దేశ రాజధానిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, క్యాబినెట్‌లో మార్పులపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో ఈ భేటీ జరిగింది.


ఇవి కూడా చదవండి

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్

Updated Date - Jul 25 , 2026 | 06:02 PM