Share News

గ్రామాల్లో కాంగ్రెస్‌ ఏదీ?

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:15 AM

కాంగ్రెస్‌ పార్టీకి గ్రామాల్లో పట్టు లేదని, 2029 ఎన్నికల్లోనూ ఘోర పరాజయం తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.

గ్రామాల్లో కాంగ్రెస్‌ ఏదీ?
amithsha

  • ఢిల్లీలో నిరసనలతో దేశ ప్రజలందరి గొంతుక వినిపించినట్లు కాదు

  • సర్‌ వచ్చింది 2024లో..

  • కాంగ్రెస్‌ దశాబ్దాలుగా ఓడుతూ వస్తోంది

  • 2029లోనూ ఘోర ఓటమే: అమిత్‌ షా

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13: కాంగ్రెస్‌ పార్టీకి గ్రామాల్లో పట్టు లేదని, 2029 ఎన్నికల్లోనూ ఘోర పరాజయం తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్నికల ప్రక్రియలను విమర్శించడం మాని, కాంగ్రెస్‌ పార్టీ తన వైఫల్యాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. సర్‌లో అక్రమాలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో.. ఇండియా కూటమి నేతలతో కలసి కొన్ని రోజులుగా రాహుల్‌ గాంధీ ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతెలిసిందే. దీంతో మంగళవారం అమిత్‌షా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా, రాహుల్‌ వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి గ్రామాల్లో ఉనికే లేదన్నారు. ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను సమీకరించి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు నిర్వహించినంత మాత్రాన దేశ ప్రజలందరి గొంతుక వినిపించినట్లు కాదన్నారు. దేశ ప్రజల గొంతుక అన్నది పొలాలు, పల్లెలు, కొండలు, అడవులు, నదీ తీరాల్లోనూ వినిపిస్తుందంటూ.. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఉనికి నామమాత్రమేనని, దాదాపు లేనేలేదన్న విషయాన్ని ఆ పార్టీ అర్థం చేసుకోవాలన్నారు. సర్‌ 2024లోనే అమల్లోకి వచ్చిందని.. కానీ, కాంగ్రెస్‌ పార్టీ అంతకుముందు నుంచే వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వచ్చిందని గుర్తు చేశారు.


2029 ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సకు ఘోర పరాజయం తప్పదన్నారు. వరుసగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోనుందని జోస్యం చెప్పారు. గుజరాత్‌లో తాజాగా జరిగిన మూడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 104కు గాను 90 చోట్ల విజయం సాధించిన అనంతరం అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గాంధీనగర్‌లో బీజేపీ ఓటు శాతం క్రితం ఎన్నికలతో పోలిస్తే 10 శాతం పెరిగినట్లు అమిత్‌షా చెప్పారు. ఈ ఫలితాలను ప్రధాని మోదీకి లభిస్తున్న నిరంతర ప్రజా మద్దతుకు నిదర్శనంగా పేర్కొన్నారు. 1985 నుంచి గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఒక్క ఎన్నికల్లోనూ గెలవలేదని అమిత్‌షా గుర్తు చేశారు. త్రిపురలోనూ గత 33 ఏళ్లుగా కాంగ్రె్‌సకు ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. అలాగే, బెంగాల్లోనూ 54 ఏళ్ల నుంచి ఒక్క ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ గెలవలేదన్న గణాంకాలను షా ఉదహరించారు. ఇక రాహుల్‌ నిర్వహిస్తున్న ‘ఛాత్రోన్‌కీ గూంజ్‌’ (విద్యార్థుల ప్రతిధ్వని) కార్యక్రమాన్ని అబద్ధాల ప్రతిధ్వనిగా అమిత్‌షా అభివర్ణించారు.

ఈ వార్తలు కూడా చదవండి

సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక

నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ఐ ఎస్ ఎస్ కు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక

Updated Date - Oct 14 , 2026 | 04:16 AM