Share News

పదవుల కన్నా దేశమే ముఖ్యం: అమిత్‌ షా

ABN , Publish Date - Jul 27 , 2026 | 06:30 AM

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసించారు. వ్యక్తిగత పదవుల కన్నా దేశ ప్రయోజనాలకే...

పదవుల కన్నా దేశమే ముఖ్యం: అమిత్‌ షా

న్యూఢిల్లీ, జూలై 26: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసించారు. వ్యక్తిగత పదవుల కన్నా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిన చర్యగా దానిని అభివర్ణించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో స్పందించిన షా.. ‘‘బీజేపీ కార్యకర్తలకు పదవుల కన్నా దేశం, యువత, విద్యార్థులు వారి ప్రయోజనాలే ముఖ్యం. కేంద్రమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడమే ఈ సిద్ధాంతానికి నిదర్శనం’’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం దేశ యువత భావోద్వేగాలను గౌరవిస్తుందని, పేపర్‌ లీకేజీలను అరికట్టేందుకు విద్యావ్యవస్థలో కఠిన సంస్కరణలను తెచ్చేందుకు కట్టుబడి ఉందని షా స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌ అందించిన సేవలను షా గుర్తుచేసుకున్నారు. జాతీయ విద్యావిధానం అమలు, పీఎంశ్రీ పాఠశాలల విస్తరణ, డిజిటల్‌ విద్య ప్రోత్సాహంలో ప్రధాన్‌ విశేష కృషి చేశారని అమిత్‌షా కొనియాడారు.

ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 06:30 AM