15 నుంచి అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:20 AM
ప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్ర కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దేశవ్యాప్తంగా నిర్ణీత బ్యాంకులకు చెందిన 554 శాఖల్లో ఈ నెల 15 నుంచి ప్రారంభంకానుంది....
జమ్మూ, ఏప్రిల్ 9: ప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్ర కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దేశవ్యాప్తంగా నిర్ణీత బ్యాంకులకు చెందిన 554 శాఖల్లో ఈ నెల 15 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు శ్రీఅమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు యాత్రికుల కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. యాత్రికుల వివరాల నమోదు, అనుమతుల జారీ ప్రక్రియ ప్రతిమార్గంలో ఉన్న రోజువారి కోటాకు అనుగుణంగా ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో జరుగుతుందని తెలిపింది. 13 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారికి మాత్రమే యాత్రకు అనుమతి ఉండగా.. 6 వారాల గర్భిణులకు యాత్ర నిషేధం. యాత్రికులు తప్పనిసరిగా అనుమతి పొందిన వైద్యులు, వైద్యసంస్థల నుంచి పొందిన (ఏప్రిల్ 8 తర్వాత జారీ చేసిన) ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పద్ధతిలో జరుగుతుంది. దరఖాస్తు రుసుమును రూ.150గా నిర్ణయించారు. యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుండగా.. అందుకు 7 రోజుల ముందు నమోదు ప్రక్రియ ముగుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News