అయోధ్య రామాలయ విరాళాలు మాయం: అఖిలేశ్
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:46 AM
అయోధ్యలోని రామమందిరానికి భక్తుల నుంచి వచ్చిన విరాళాల్లో కోట్లాది రూపాయలు కనిపించడం లేదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అఽధిపతి అఖిలేశ్...
లఖ్‌నవూ, జూన్ 7: అయోధ్యలోని రామమందిరానికి భక్తుల నుంచి వచ్చిన విరాళాల్లో కోట్లాది రూపాయలు కనిపించడం లేదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అఽధిపతి అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఎక్స్‌లో హిందీలో పోస్టు పెడుతూ ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ఇది బాధ కలిగించే వార్త. రామ మందిరానికి వచ్చిన విరాళాల్లో కోట్లాది రూపాయలు కనిపించడం లేదు. దీనిపై ఆలయ ధర్మకర్తల మండలి, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉండడం అనుమానాలు కలిగిస్తున్నాయి’’ అని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ విశ్వాసకులకు సంబంధించిన అంశం కావడంతో న్యాయస్థానమే దీనిని పరిగణనలోకి తీసుకొని సుమోటోగా విచారణ జరపాలని కోరారు. దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు మహంత్ దీనేంద్ర దాస్ స్పందించారు. దర్యాప్తునకు సిద్ధమేనని తెలిపారు. ట్రస్టు కార్యదర్శి చంపత్‌రాయ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుతం అంతర్గత ఆడిట్ జరుగుతోందని, ఇంతవరకు ఎలాంటి లోపాలు వెల్లడి కాలేదని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News