Share News

ఎయిరిండియా విమానానికి ఊడిన ముందు చక్రాలు

ABN , Publish Date - Mar 12 , 2026 | 06:11 AM

హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది...

ఎయిరిండియా విమానానికి ఊడిన ముందు చక్రాలు

  • హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌ వెళ్లిన విమానానికి

తప్పిన ముప్పు.. 133 మంది ప్రయాణికులు సురక్షితం

ముంబై, శంషాబాద్‌ రూరల్‌, మార్చి11: హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది. ఫుకెట్‌ విమానాశ్రయంలోని రన్‌వేపై ల్యాండ్‌ అవుతుండగా ఆ విమానం కుదుపునకు(హార్డ్‌ ల్యాండింగ్‌) గురవ్వగా.. ల్యాండింగ్‌ గేర్‌ దెబ్బ తిని విమాన ముందు భాగంలోని రెండు చక్రాలు(నోస్‌ వీల్స్‌) ఊడిపోయాయి. దీంతో రన్‌వేపై అదుపు తప్పిన విమానం కాస్త దూరం వెళ్లి ఆగిపోయింది. ఇద్దరు చిన్నారులు సహా విమానంలోని 133 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది అదృష్టవసాత్తు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. విమానం శంషాబాద్‌ నుంచి బుధవారం తెల్లవారుజామున ఫుకెట్‌ బయలుదేరింది. ప్రయాణికుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు చాలా మంది ఉన్నారు. ఉదయం 11.24 గంటలప్పుడు ఆ విమానం ఫుకెట్‌ విమానాశ్రయంలోని రన్‌వే9పై ల్యాండ్‌ అవుతుండగా హార్డ్‌ ల్యాండింగ్‌ వల్ల నోస్‌ వీల్స్‌ ఊడిపోయాయి. దీంతో విమానం పక్కకు ఒరిగిపోగా.. పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పింది. విమానం అక్కడే ఆగిపోవడంతో ఎయిర్‌పోర్టులో సేవలను కొద్దిసేపు నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి..

సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం

స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Updated Date - Mar 12 , 2026 | 06:11 AM