ఏఐతో వైట్‌కాలర్ జాబ్‌లు గల్లంతే!
ABN , Publish Date - Feb 13 , 2026 | 06:20 AM
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ(ఏఐ) అభివృద్ధి సంస్థ ఆంథ్రోపిక్.. తమ అధునాతన క్లౌడ్ కోవర్క్ ప్లాట్‌ఫామ్‌పై చేసిన ప్రకటనతో రేగిన కలకలాన్ని మరువక ముందే మైక్రోసాఫ్ట్ మరో...
ఐటీ ఉద్యోగులతోపాటు న్యాయవాదులు, అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణులకు ముప్పే
మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్ హెడ్ ముస్తఫా సులేమాన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: అమెరికాకు చెందిన కృత్రిమ మేధ(ఏఐ) అభివృద్ధి సంస్థ ఆంథ్రోపిక్.. తమ అధునాతన క్లౌడ్ కోవర్క్ ప్లాట్‌ఫామ్‌పై చేసిన ప్రకటనతో రేగిన కలకలాన్ని మరువక ముందే మైక్రోసాఫ్ట్ మరో బాంబు పేల్చింది. ఏఐ వినియోగం వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతోపాటు న్యా యవాదులు, అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణుల ఉద్యోగాలకూ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఏడాది వ్యవధిలోనే ఈ మార్పును చూస్తామని మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్ హెడ్ ముస్తఫా సులేమాన్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేస్తున్న ‘ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ’ అనే ఏఐ మోడల్ వృత్తి నిపుణులు చేసే అన్ని పనులను చేస్తుందని ముస్తఫా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, న్యాయవాదులు, ఆర్కిటెక్ట్‌లు వంటి వృత్తి నిపుణులు చేసే పనులన్నింటినీ తమ ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ చేస్తుందని వెల్లడించారు. ఫలితంగా సమీప భవిష్యత్తులో ఉద్యోగావకాశాలపై పెను ప్రభావం ఉండనుందని తెలిపారు. మరో ఏడాది తర్వాత కంప్యూటర్ల ముందు కూర్చోని పని చేసే ప్రతి ఒక్కరి ఉపాధికి ఏఐ వల్ల ముప్పు తప్పదని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు