Share News

ఏఐతో మరిన్ని ఉద్యోగాలు

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:51 AM

ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనల వేళ ఉపశమనం కలిగించే వార్త ఒకటి వెలువడింది. ఏఐతో పోతున్న ఉద్యోగాల కంటే కొత్తగా లభిస్తున్నవే ఎక్కువుంటున్నాయని నోమూరా హోల్డింగ్స్‌...

ఏఐతో మరిన్ని ఉద్యోగాలు

8 భారత్‌లో 31,921 మంది ఉద్యోగాలు

కోల్పోగా.. 83,100 మందికి కొత్త జాబ్స్‌

8 జపాన్‌ కంపెనీ నోమూరా హోల్డింగ్స్‌ వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనల వేళ ఉపశమనం కలిగించే వార్త ఒకటి వెలువడింది. ఏఐతో పోతున్న ఉద్యోగాల కంటే కొత్తగా లభిస్తున్నవే ఎక్కువుంటున్నాయని నోమూరా హోల్డింగ్స్‌ అనే జపాన్‌ కంపెనీ వెల్లడించింది. 2022 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకూ ఆసియాలోని పలు దేశాల్లో ఏఐ కారణంగా ఉద్యోగ రంగంలో సంభవించిన మార్పులను విశ్లేషిస్తూ నోమూరాకు చెందిన ఆర్థికవేత్తలు సోనాల్‌వర్మ, సీయింగ్‌తో ఒక నివేదికను వెలువరించారు. దీని ప్రకారం.. భారత్‌లో ఈ కాలవ్యవధిలో ఏఐ వల్ల 31,921మంది ఉద్యోగాలు కోల్పోగా, 83,100మందికి ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లలో ప్రధానంగా సపోర్ట్‌టీమ్స్‌కు చెందినవారున్నారు. చాట్‌బాట్స్‌ వీరి స్థానాన్ని ఆక్రమించాయి. ఏఐ టెక్నాలజీతో ఎంట్రీలెవల్‌ ఉద్యోగులకు డిమాండ్‌ తగ్గుతుండగా, అనుభవం ఉన్న వారికి డిమాండ్‌ పెరుగుతోంది. ఆసియా వ్యాప్తంగా చూస్తే ఏఐతో గత నాలుగేళ్లలో 60,654 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 1,30,758 మందికి ఉద్యోగాలు లభించాయి. అయితే, ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉండకపోవచ్చని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 09 , 2026 | 05:51 AM