Share News

అగ్నివీరులకు మరో చాన్స్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:35 AM

అగ్నివీరుల సేవలను మరో రెండేళ్లు వినియోగించుకోవాలని కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

అగ్నివీరులకు మరో చాన్స్‌
agniveers

  • రెండేళ్లు సర్వీసు పొడిగింపు.. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం

  • 18వేల మందికి తక్షణ ప్రయోజనం

న్యూఢిల్లీ, నవంబరు 4 : అగ్నివీరుల సేవలను మరో రెండేళ్లు వినియోగించుకోవాలని కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారిలో 18 వేలమంది అగ్నిపథ్‌ నిబంధనల ప్రకారం త్వరలోనే పదవీవిరమణ చేయనున్నారు. అయితే, వారిలో 75 శాతం మందిని మరో రెండేళ్లకాలం కొనసాగించనున్నట్టు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి తెలిపారు. అగ్నివీరులను స్వల్ప కాలానికే నియమించడం పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యువతతో సైనిక దళాలను శక్తిమంతం చేయడం కోసం 2022లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకానికి ఎంపికైన వారిని అగ్నివీరులుగా వ్యవహరిస్తారు. నాలుగేళ్ల కాలానికి వీరిని సైనిక దళాల్లో నియమిస్తారు. వారిలో 25 శాతం మందికి మాత్రం రెగ్యులర్‌ ఆర్మీలో అవకాశం ఇస్తారు. అయితే, అగ్నిపథ్‌ నిబంధనలు కఠిన శిలలా స్థిరంగా ఉండవని, సందర్భం, అవసరాన్ని బట్టి అగ్నివీరులకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగా వారి ఎంపిక ఉంటుంది. నిజానికి, ఇది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై మేం మూడున్నర నెలలుగా కసరత్తు చేస్తున్నాం. మా ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్‌ ఇప్పుడు ఆమోదించింది.’’ అని వివరించారు.చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ సుబ్రమణి వెల్లడి(మారుతుంటాయని సుబ్రమణి తెలిపారు


ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల బలోపేతం

దేశంలోని ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా, బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులను విచారిస్తున్న ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను బలోపేతం చేయడంతోపాటు, విస్తరించాలని బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి కోర్టులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 850 ఉన్నాయి. పోక్సో కోర్టులుగా వ్యవహరించే ఈ న్యాయస్థానాలకు అదనపు సిబ్బందిని, వసతులను అందించనున్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ కేసుల విచారణను వేగవంతం చేయడం కోసం ఇప్పటికే ఉన్న చట్టాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు కొత్త చట్టాల (ముసాయిదా) తయారీపై దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే.

అమెరికా తొలి ముస్లిం సెనెటర్ భార్యకు భారతీయ మూలాలు

Updated Date - Nov 05 , 2026 | 05:43 AM