స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో అగ్నీ-3 పరీక్ష విజయవంతం
ABN , Publish Date - Feb 06 , 2026 | 09:53 PM
స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా నిర్వహించిన అగ్నీ-3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్‌లో పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది (Agni -3 Missile Test). ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్‌లో (Integrated Test Range) ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్ష్యాలు అన్నిటినీ మిసైల్ అందుకుందని రక్షణ శాఖ తెలిపింది. ఈ పరీక్షతో భారత దళాల సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత మరింత పెరిగిందని పేర్కొంది (Strategic Forces Command).
అగ్నీ సిరీస్‌కు సంబంధించి భారత్ వద్ద వివిధ రకాల మిసైల్స్ ఉన్న విషయం తెలిసిందే. అగ్నీ-1 మిసైల్ 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అగ్నీ-2 మిసైల్ రేంజ్ 2 వేల కిలోమీటర్లు. అగ్నీ-3 మిసైల్ 3 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను, అగ్నీ-4 మిసైల్ 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇక అగ్నీ-5 మిసైల్ రేంజ్ అత్యధికంగా 5 వేల కిలోమీటర్లు.
అగ్నీ-1 మిసైల్‌తో 220 కిలోమీటర్ల కనిష్ఠ దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయొచ్చని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా 150-300 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించే పృథ్వి సిరీస్ మిసైల్స్‌కు అనుబంధంగా అగ్నీ-1 మిసైల్స్‌ను వినియోగించుకోవచ్చని అన్నాయి.
మరోవైపు, వివిధ దేశాలు అగ్నీ మిసైల్స్‌పై ఆసక్తి కనబరుస్తు్న్నాయి. మిసైల్స్ కోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి. అటు అగ్నీ సిరీస్ బాలిస్టిక్ మిసైల్స్, ఇటు బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్‌తో భారత దళాలు 30 కిలో మీటర్ల నుంచి 5 వేల కిలోమీటర్ల దూరంలోని శత్రుదేశ లక్ష్యాలను సులువుగా ధ్వంసం చేయగలవని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఒత్తిడి చేయలేం... సుప్రీంకోర్టు తీర్పు
‘ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు.. పబ్లిసిటీ కావాలా’: సుప్రీంకోర్టు