మీరు తిరిగొస్తానంటే చెప్పండి.. గంటలో రిజైన్ చేస్తా: టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:00 PM
టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ రెబల్ ఎంపీలకు తాజాగా సవాలు విసిరారు. వారు మళ్లీ పార్టీలోకి తిరిగొస్తానంటే తాను గంటలో రాజీనామా చేసి పార్టీ నుంచి తప్పుకుంటానని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ రెబల్ ఎంపీలకు తాజాగా సవాలు విసిరారు. వారు మళ్లీ పార్టీలోకి తిరిగొస్తానంటే తాను గంటలో రాజీనామా చేసి పార్టీ నుంచి తప్పుకుంటానని అన్నారు. తన వల్లే సమస్య అని రెబల్ ఎంపీలు భావిస్తే, వారి అసంతృప్తికి తానే కారణమని నమ్మితే తాను రాజీనామాకు సిద్ధమేనని అన్నారు. వెంటనే తిరిగి రావాలని సవాలు విసిరారు.
గత నెలలో టీఎంసీ రెబల్ నేత కాకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని 20 మంది రెబల్ ఎంపీలు తాము ఎన్‌సీపీఐ పార్టీలో విలీనం అవుతున్నట్టు ప్రకటించారు. ఈ విలీనానికి స్పీకర్ ఓం బిర్లా త్వరలో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఇటీవల షిండే వర్గంలో చేరిన విషయంలో తెలిసిందే. ఈ విలీనానికి స్పీకర్ ఓం బిర్లా తాజాగా ఆమోదముద్ర వేశారు. దీంతో, లోక్‌సభలో షిండే వర్గం సంఖ్యాబలం 7 నుంచి 13కు పెరిగింది.
శివసేన (యూబీటీ)కి మాత్రం ముగ్గురు ఎంపీలే మిగిలారు. ఈ విలీనాల నేపథ్యంలో ఎన్డీయేకు మద్దతు తెలిపే ఎంపీల సంఖ్య పెరుగుతోంది. దీంతో, వర్షాకాల సమావేశాల్లో బీజేపీ మరోసారి నియోజకవర్గ పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలనూ చదవండి:
స్కైరూట్ వ్యవస్థాపకుల సక్సెస్ స్టోరీ.. ఇస్రో నుంచి విక్రమ్-1 విజయవంతం వరకు..
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది మృతి..