కోర్టు తీర్పును స్వాగతించిన ఆప్
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:25 AM
ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులను మద్యం స్కాంలో నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్వాగతించారు...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులను మద్యం స్కాంలో నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్వాగతించారు. ఇది సత్యానికి, రాజ్యాంగ విలువలకు దక్కిన విజయంగా అభివర్ణించారు. ‘సత్యమేవ జయతే’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆప్ నాయకత్వాన్ని కించపరిచేందుకు చేసిన కుట్రలను కోర్టు పటాపంచలు చేసిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. కోర్టు నిర్ణయం సత్యానికి దక్కిన విజయమని.. ‘సత్యమేవ జయతే’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ పేర్కొన్నారు.
కేంద్ర సంస్థలను బీజేపీ వాడుకుంది: సీపీఐ
కేజ్రీవాల్ విడుదలతో కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుందని తేలిపోయిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వ్యాఖ్యానించారు. ‘వారు నెలల తరబడి జైలు జీవితం గడిపారు. కుటుంబాలకు దూరమయ్యారు. రాజకీయ ప్రత్యర్థులైన వారి నోరు మూయించడానికే బీజేపీ ఇదంతా చేసింది. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను ఆ పార్టీ రాజకీయ ప్రతీకార సాధనాలుగా ఎలా వాడుకుందో మరోసారి స్పష్టమైంది’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ