పుట్టిన తేదీకి ఆధార్ రుజువు కాదు
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:24 AM
పుట్టిన తేదీకి ఆధార్ రుజువు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ కేవలం గుర్తింపునకు రుజువు (ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ) మాత్రమేనని తెలిపింది.
ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, నవంబరు 19: పుట్టిన తేదీకి ఆధార్ రుజువు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ కేవలం గుర్తింపునకు రుజువు (ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ) మాత్రమేనని తెలిపింది. అధికారిక పత్రాలను పరిశీలించి కాకుండా కేవలం వ్యక్తుల ఇచ్చే స్వీయ ధ్రువీకరణను ఆధారం చేసుకొని ‘ఆధార్ కార్డు’ల్లో పుట్టిన తేదీని నమోదు చేస్తారని పేర్కొంది. అందువల్ల ఆధార్‌ను పుట్టిన తేదీ ధ్రువపత్రంగా పరిగణించలేమని తెలిపింది. ఇదే విషయాన్ని ఆధార్ కార్డులు జారీ చేసే ఉడాయ్ కూడా పేర్కొందని గుర్తుచేసింది. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ఆధారం చేసుకొని ఓ ఉద్యోగినికి ఏడాది ముందుగానే పదవీ విరమణ చేయించిన యాజమాన్యాన్ని తప్పుపడుతూ ఈ స్పష్టత ఇచ్చింది.