Share News

బెంగాల్‌లో 65 శాతం ఎమ్మెల్యేలది నేరచరితే

ABN , Publish Date - May 07 , 2026 | 07:12 AM

పశ్చిమ బెంగాల్‌లో తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో 190 మంది(65ు) నేరచరిత్ర ఉన్నవారేనని...

బెంగాల్‌లో 65 శాతం ఎమ్మెల్యేలది నేరచరితే

న్యూఢిల్లీ, మే 6 (ఆంధ్రజోతి): పశ్చిమ బెంగాల్‌లో తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో 190 మంది(65ు) నేరచరిత్ర ఉన్నవారేనని అసోషియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) పేర్కొంది. వారిలో 170 మందిపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులున్నాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌ శాసనసభలో 294 మంది ఎమ్మెల్యేలకు గాను 292 మంది సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్‌.. ఓ నివేదికను రూపొందించి బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2021లో ఎన్నికైన ఎమ్మెల్యేలలో 49ు మందిపై క్రిమినల్‌ కేసులుండగా ఈసారి ఆ సంఖ్య 65 శాతానికి చేరింది. అసోం ఎమ్మెల్యేలలో 21 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి.

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 07:12 AM