టాయిలెట్ సీటులో ఆరు అడుగుల నాగుపాము..
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:47 PM
టాయిలెట్ సీటులో ఆరు అడుగుల నాగుపాము వెలుగు చూసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్‌నెట్ డెస్క్: టాయిలెట్ సీటులో ఆరు అడుగుల నాగుపాము వెలుగు చూసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్, గర్హౌలీ కలన్ గ్రామంలోని ఓ ఇంట్లో నాగుపాము కలకలం రేపింది. టాయిలెట్ సీటులోని సందులో పాము కనిపించటంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వైల్డ్‌లైఫ్ కన్సర్వేటర్ అనిల్ గందాస్‌కు సమాచారం ఇచ్చారు. అనిల్ ఇంటికి చేరుకునే సమయానికి ఆ పాము టాయిలెట్ సీటు లోపలికి వెళ్లిపోయింది. దీంతో టాయిలెట్ సీటును పగులగొట్టాల్సి వచ్చింది.
అనిల్ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ‘అడువులను నరికేస్తుండటంతో పాములు ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 70 పాములను రెస్క్యూ చేశాను. 3 నెలల్లో 200 పాములను రెస్క్యూ చేశాను. వర్షాకాలం ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేలపై పడుకోకపోవటం చాలా మంచిది. దోమ తెరలు ఉపయోగించండి. ఎలుకల బెడద లేకుండా చూసుకోండి. ఎలుకలు లేకపోతే పాములు వచ్చే అవకాశం తక్కువ’ అని అన్నారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన.. 57 ఏళ్ల రికార్డు బద్దలు
సండే పార్టీలో దారుణం.. చికెన్ ముక్కలు ఎక్కువగా తిన్నాడని స్నేహితుడి హత్య..