Share News

గల్ఫ్‌ నుంచి 52,360 మంది రాక

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:23 AM

గల్ఫ్‌ దేశాల నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు 52,360 మందిని భారత్‌కు తరలించినట్లు డీజీసీఏ తెలిపింది. ఇందుకు భారత విమానయాన సంస్థలు 184 విమానాలు, యూఏఈ విమానయాన...

గల్ఫ్‌ నుంచి 52,360 మంది రాక

  • 280 విమానాల్లో తరలింపు : డీజీసీఏ

న్యూఢిల్లీ, మార్చి 7: గల్ఫ్‌ దేశాల నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు 52,360 మందిని భారత్‌కు తరలించినట్లు డీజీసీఏ తెలిపింది. ఇందుకు భారత విమానయాన సంస్థలు 184 విమానాలు, యూఏఈ విమానయాన సంస్థలు 85 విమానాలు నడపగా, 11 ప్రత్యేక విమానాలు ఉపయోగించారు. యూఏఈలో రెగ్యులర్‌ విమానాల షెడ్యూళ్లను రద్దు చేసినందున భారత విమానయాన సంస్థలు అందుబాటులోకి వచ్చిన స్లాట్లను బట్టి ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి. కాగా దుబాయి ఎయిర్‌పోర్ట్‌ను శనివారం ఉదయం మూసివేశారు. ఈ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే, వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసినందున అక్కడికి రావొద్దని ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ శనివారం ఉదయం ‘ఎక్స్‌’లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ

Updated Date - Mar 08 , 2026 | 04:23 AM