Share News

ప్రజా ప్రతినిధుల్లో 40శాతం మంది ‘క్రిమినల్స్‌’

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:33 AM

ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసుల్లో విచారణను సత్వరం పూర్తి చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. 2016 నాటి ఈ పిటిషన్‌ను సత్వరం పరిష్కరించాల్సిన కేసుల జాబితాలో చేర్చేందుకు బెంచ్‌ అనుమతించింది

ప్రజా ప్రతినిధుల్లో   40శాతం మంది ‘క్రిమినల్స్‌’
SUPREMECOURT

  • ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4000కి పైగా కేసులు

  • 14 రాష్ట్రాల సీఎంలపై తీవ్ర నేరాభియోగాలు

  • వాటి విచారణపై మార్గదర్శకాలను కోరిన పిల్‌

వెంటనే విచారించేందుకు సుప్రీం సమ్మతి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసుల్లో విచారణను సత్వరం పూర్తి చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. 2016 నాటి ఈ పిటిషన్‌ను సత్వరం పరిష్కరించాల్సిన కేసుల జాబితాలో చేర్చేందుకు బెంచ్‌ అనుమతించింది. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల విచారణకు సంబంధించి సత్వరం మార్గదర్శకాలు జారీచేయాలని పిటిషనర్‌, ఈ కేసులో అమికస్‌ క్యూరీ అయిన సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా కోరారు. ‘‘దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో 40ు మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. లోక్‌సభ ఎంపీల్లో 251 మంది, రాజ్యసభ ఎంపీల్లో 75 మంది హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, అపహరణలు వంటి అతి తీవ్రమైన నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలను కూడా కలుపుకొంటే ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4వేలకు పైగానే కేసులున్నాయి. 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇందులో కర్ణాటక సీఎం శివకుమార్‌పై 19 కేసులు, పశ్చిమబెంగాల్‌ సీఎం సువేందు అధికారిపై 29 కేసులు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై 89 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో విచారణను త్వరితగతిన, సమర్థవంతంగా పూర్తి చేసేలా స్పష్టమైన మార్గదర్శకాలను ఇవ్వాల్సి ఉంది’’ అని ఆయన వాదించారు.

ఈ వార్తలు కూడా చదవండి

సీబీఎస్‌ఈ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కే భండారీ

సార్.. నోరు తెరవండి.. డీఎంకే అధినేత స్టాలిన్‌‌పై సీఎం విజయ్ ఫైర్

Updated Date - Sep 26 , 2026 | 04:33 AM