అమెరికాకు బైబై..
ABN , Publish Date - Apr 24 , 2026 | 06:09 AM
అమెరికాకు వెళ్లడం చాలా మంది భారతీయులకు కల. అక్కడ ఉద్యోగం, నివా సం వారి లక్ష్యం. కానీ ప్రస్తుతం ఆ కల నెమ్మదిగా చెదిరిపోతోంది. అగ్రరాజ్యంలో...
దేశం వదిలి వెళ్లడానికి 40 శాతం భారత జాతీయులు సిద్ధం
రాజకీయ, ఆర్థిక, సామాజిక
పరిస్థితుల వల్లే.. కార్నెగీ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: అమెరికాకు వెళ్లడం చాలా మంది భారతీయులకు కల. అక్కడ ఉద్యోగం, నివా సం వారి లక్ష్యం. కానీ ప్రస్తుతం ఆ కల నెమ్మదిగా చెదిరిపోతోంది. అగ్రరాజ్యంలో ఇక ఉండలేమని పలువురు భారతీయ అమెరికన్లు భావిస్తున్నారు. అక్కడి పరిస్థితులతో రోజురోజుకూ వారిలో ఆందోళన పెరుగుతోంది. యూఎ్‌సను వదిలి వెళ్లిపోవడానికి తాము సిద్ధం అంటూ సుమారు 40ు మంది భారత జాతీయులు చెబుతున్నారు. రాజకీయ, ఆర్థి క, సామాజిక పరిస్థితులే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. యూగవ్‌తో కలసి కార్నెగీ ఎండోమెంట్స్ సంస్థ చేసిన సర్వేలో వెయ్యి మంది అభిప్రాయాలు సేకరించగా, ఆ విషయం వెల్లడైంది. అమెరికాను వదిలి వెళ్లిపోవాలనే ఆలోచన తమకు తరచూ వస్తోందని 14ు మంది, అప్పుడప్పుడూ అలా అనిపిస్తోందని 26ు మంది సర్వేలో పేర్కొన్నారు. అమెరికా రాజకీయాలు, ప్రభుత్వ విధానాలపై 58ు మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెరిగిన జీవన వ్యయాన్ని భరించలేకపోతున్నామని 54ు మంది చెప్పారు. వ్యక్తిగత భద్రత అంశాన్ని 41ు మంది ప్రస్తావించారు. ప్రస్తుతం 52 లక్షల మంది భారత జాతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, వలస విధానాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రభుత్వ నిర్ణయాలు తమకు నచ్చడం లేదని ఏకంగా 71ు మంది చెప్పారు. ఇక భారతీయులు అమెరికాను వదిలి వెళ్లిపోవాలి అనుకోవడానికి పెరిగిపోతున్న ఖర్చులు కూడా మరో ప్రధాన కారణం.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి