-
-
Home » Mukhyaamshalu » Latest Breaking viral trending National International Andhra Pradesh and Telangana ABN AndhraJyothy Live Updates on Jan 7th kjr
-
బ్లోఅవుట్ పరిసర ప్రాంతాల వాసులు తిరిగి రావచ్చు: కోనసీమ కలెక్టర్
ABN , First Publish Date - Jan 07 , 2026 | 06:07 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 07, 2026 22:05 IST
ఢిల్లీ: అమిత్ షాతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ
అమిత్ షాతో గంటపాటు సాగిన సీఎం చంద్రబాబు సమావేశం
-
Jan 07, 2026 20:19 IST
కోనసీమ: బ్లోఅవుట్ పరిసర ప్రాంతాల వాసులు తిరిగి రావచ్చు: కలెక్టర్
90 శాతం మంది స్థానికులు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు: కలెక్టర్
ఎటువంటి భయం అవసరం లేదు: కలెక్టర్ మహేష్‌కుమార్
ప్రమాదం జరిగిన పరిసర 4 గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉంది
నష్టం వివరాలు అంచనాలు వేస్తున్నాం: కలెక్టర్ మహోష్‌కుమార్
-
Jan 07, 2026 18:31 IST
తుని రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం
స్టేషన్ బిల్డింగ్ పైన భారీగా వ్యాపించిన పొగ
నేమ్ బోర్డులకు అంటుకున్న మంటలు
-
Jan 07, 2026 18:30 IST
చెన్నై: పేలిన సీఎం స్టాలిన్ కాన్వాయ్‌లోని కారు టైరు
దిండిగల్‌లో ప్రభుత్వ కార్యక్రమం ముగించుకుని...
మధురైకి తిరుగుప్రయాణం సమయంలో ఘటన
తిరుమంగళం సమీపంలో పేలిన కాన్వాయ్‌లోని కారు టైరు
అందరూ సురక్షితం... తృటిలో తప్పిన ప్రమాదం
-
Jan 07, 2026 18:24 IST
సంక్రాంతికి 6,431 TGSRTC ప్రత్యేక బస్సులు
ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు: TGSRTC
-
Jan 07, 2026 16:22 IST
ఏపీ సచివాలయం లో ముందే వచ్చిన సంక్రాంతి..
మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు జరువుతున్న సచివాలయ ఉద్యోగ సంఘం
ఇటీవల కొత్త కార్యవర్గం ఏర్పాటుకావడంతో ఉత్సాహంగా పాల్గొంటున్న మహిళలు, ఉద్యోగులు
ఇవాళ, రేపు సచివాలయ ఉద్యోగులు సంక్రాంతి ముగ్గులు, క్రీడా పోటీలు
మహిళలకు ముగ్గుల పోటీ లు.. పురుషులకు వాలీబాల్ పోటీల నిర్వహణ
-
Jan 07, 2026 14:52 IST
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్
మరో ఇద్దరు BRS మాజీ ఎమ్మెల్యేలకు సిట్ పిలుపు
మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యకు నోటీసులు
రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు
-
Jan 07, 2026 14:27 IST
సీఎం రేవంత్ సమక్షంలో ఖమ్మం BRS కార్పొరేటర్లు చేరిక
కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు రాధ, ఉమారాణి, శ్రీదేవి
మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరికలు
-
Jan 07, 2026 13:40 IST
మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. 26 మంది లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ..
26 మంది మావోయిస్టులు లొంగుబాటు..
లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళా మావోయిస్టులు..
లొంగిపోయినవారిపై మొత్తం రూ.64 లక్షల రివార్డు..
PLGA, సౌత్‌బస్తర్, మార్, AOB ప్రాంతాల్లో పనిచేసిన మావోయిస్టులు లొంగుబాటు.
-
Jan 07, 2026 13:33 IST
టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వాన్ని ఆశ్రయించొచ్చు: హైకోర్టు
రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వాన్ని ఆశ్రయించొచ్చన్న హైకోర్టు..
హోం ముఖ్య క్యార్యదర్శికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు..
నిర్మాతలు ఇచ్చే రేట్ల పెంపు విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలివ్వమన్న హైకోర్టు..
సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలు గేమ్ చేంజర్ , పుష్ప 2, OG సినిమాలకు మాత్రమే వర్తిస్తుందన్న హైకోర్టు..
సినిమా రేట్లు పెంపు, బేఫిట్ షోలపై అవసరం అనుకుంటే సింగిల్ బెంచ్‌ను కూడా ఆశ్రయించవచ్చన్న న్యాయస్థానం.
-
Jan 07, 2026 12:39 IST
టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తెలపాలి: హైకోర్టు
టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తెలపాలన్న హైకోర్టు..
మధ్యాహ్నం విచారణకు జీపీ హాజరుకావాలని ఆదేశం..
ఇప్పటికే నిర్మాతల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు..
అఖండ 2 ఇచ్చిన రిలాక్సేషన్ తమకూ ఇవ్వాలని వాదనలు వినిపించిన నిర్మాతలు తరపున న్యాయవాదులు.
-
Jan 07, 2026 12:02 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు నోటీసులు..
ఈ రోజు 1 గంటకు జూబ్లీహిల్స్ పీఎస్‌కి రావాలని నోటీసులు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకి సిట్ నోటీసులు..
మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీహిల్స్ పీఎస్‌కి రావాలని నోటీసులు.
-
Jan 07, 2026 12:00 IST
జనవరి 26న అందుబాటులోకి.. శాసన మండలి భవనం..
జనవరి 26న అందుబాటులోకి శాసన మండలి భవనం..
జనవరి 26న మండలి భవనాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్..
ఇకపై ఒకే భవనంలో శాసనసభ, శాసన మండలి సమావేశాలు..
ఆధునికీకరించిన భవనంలోనే శాసన మండలి బడ్జెట్ సమావేశాలు.
-
Jan 07, 2026 11:45 IST
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు..
ఏలూరు: హిల్ వ్యూ నుంచి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు..
ప్రాజెక్టు పనులను సీఎంకు వివరించిన మంత్రి రామానాయుడు, ప్రాజెక్టు అధికారులు.
-
Jan 07, 2026 11:41 IST
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరిన రవి..
కేసు దర్యాప్తు దశలో ఉందని.. విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని కోర్టుకు తెలిపిన పోలీసులు..
బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని కోర్టుకు తెలిపిన పోలీసులు..
విచారణ జరిపి బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన నాంపల్లి కోర్టు.
-
Jan 07, 2026 11:15 IST
సినిమాల టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టులో మొదలైన విచారణ...
హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు..
టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేసిన నిర్మాతలు..
టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన నిర్మాతలు..
టికెట్ ఎక్కువ రేటు కావాలని అడుగుతున్నారా లేదా - హైకోర్టు
రెండు సినిమాల్లో టికెట్ రేట్స్ ఎక్కువ పెంచాలి అని కోర్ట్ ని అభ్యర్థిస్తున్నాం- పిటిషనర్లు
అఖండ2 మూవీకి ఇచ్చిన రిలాక్సేషన్స్ తమకూ ఇవ్వాలని కోరిన నిర్మాతలు.
-
Jan 07, 2026 10:33 IST
ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్..
విశాఖ: భోగాపురం ఎయిర్ పోర్టు ట్రయల్ రన్ తర్వాత ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు..
రైల్వే జోన్ కార్యాలయ ఉద్యోగుల కేటాయింపు కోసం ముమ్మరంగా కసరత్తు..
959 ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వే జోన్ లో పని చేసేందుకు బదలాయింపు చేయాలని నిర్ణయం..
ఈమేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జీ ఎం శ్రీవాత్స, సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ మాధుర్ భేటీలో నిర్ణయం..
ఇప్పటికే జోరుగా సాగుతున్న జోన్ కార్యాలయ భవనాల పనులు.
-
Jan 07, 2026 10:09 IST
నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం..
ఢిల్లీ: ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం..
క్యాబినెట్‌లో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం.
-
Jan 07, 2026 09:53 IST
ఆరంజ్ ట్రావెల్స్ ఎండీ అరెస్ట్..
ఆరంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ అరెస్ట్ చేసిన జీఎస్టీ అధికారులు.
రూ.22 కోట్లు ఎగ్గొట్టిన జీఎస్టీ కేసులో ఎండీ సునీల్ అరెస్ట్..
-
Jan 07, 2026 09:19 IST
రేపటి నుంచి ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు
రేపటి నుంచి విజయవాడలో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు..
పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో ఆవకాయ్ ఉత్సవాలు..
విజయవాడ: కృష్ణా నదిలో కేరళ తరహా ఫ్లోటెడ్ హోమ్ బోట్లు..
రేపు పున్నమి ఘాట్ దగ్గర ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.
-
Jan 07, 2026 09:10 IST
అంతరాష్ట్ర దొంగ నాగిరెడ్డి అరెస్ట్
నాగర్‌కర్నూల్: పరారీలో ఉన్న అంతరాష్ట్ర దొంగ నాగిరెడ్డి అరెస్ట్..
నవంబర్ 13న కల్వకుర్తి పోలీస్‌స్టేషన్ నుంచి పరారైన నాగిరెడ్డి..
విచారణకు జైలు నుంచి కల్వకుర్తి పీఎస్‌కు నాగిరెడ్డి..
బహిర్భూమికని చెప్పి స్టేషన్ బాత్‌రూమ్‌లో నుంచి పరారైన నాగిరెడ్డి..
నాగిరెడ్డి పరారీ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్..
నాగిరెడ్డి పరారీ ఘటనలో ఎస్సైకి ఛార్జ్‌మెమో, హోంగార్డు అటాచ్.
-
Jan 07, 2026 09:04 IST
నేడు రెండో దశ ల్యాండ్ పూలింగ్..
నేడు అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్.
రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ..
ఎండ్రాయి, వడ్లమానులో చేపట్టనున్న ల్యాండ్ పూలింగ్.
-
Jan 07, 2026 08:39 IST
శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి..
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి..
అనగనగా ఒక రాజు చిత్రం ఈ నెల 14న విడుదల..
నాగచైతన్యతో ఓ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నా: నటి మీనాక్షి చౌదరి
-
Jan 07, 2026 08:37 IST
ప్రభాస్, చిరంజీవి సినిమా టికెట్ రేట్ల పెంపుపై నేడు విచారణ
నేడు ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ..
ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు..
టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేసిన నిర్మాతలు..
టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన నిర్మాతలు.
-
Jan 07, 2026 07:40 IST
నేడు రెండో దశ ల్యాండ్ పూలింగ్
నేడు అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్..
రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ..
ఎండ్రాయి, వడ్లమానులో చేపట్టనున్న ల్యాండ్ పూలింగ్.
-
Jan 07, 2026 07:40 IST
అదుపులోకి రాని బ్లోఅవుట్
కోనసీమ: ఇరుసుమండలో అదుపులోకి రాని బ్లోఅవుట్..
మరో 5 రోజులు మంటలు కొనసాగే అవకాశం ఉందన్న అధికారులు..
గూడవల్లి కాల్వ నీటితో మంటలు ఆర్పేందుకు యత్నం..
మంటల తీవ్రత తగ్గినప్పటికీ కొనసాగుతున్న నియంత్రణ చర్యలు..
విదేశీ నిపుణులతో మంటలు నియంత్రించేందుకు అధికారుల యత్నం.
-
Jan 07, 2026 07:39 IST
12 నుంచి సంక్రాంతి ఉత్సవాలు..
నంద్యాల : ఈ నెల 12వ తేదీ నుంచి శ్రీశైలంలో సంక్రాంతి ఉత్సవాలు
15వ తేదీ సంక్రాంతి రోజున లీలా కళ్యాణం..
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యక్ష పరోక్ష సేవలు తాత్కాలికంగా నిలుపుదల.
-
Jan 07, 2026 07:05 IST
నేడు పోలవరానికి సీఎం చంద్రబాబు
ఏలూరు: నేడు పోలవరం రానున్న సీఎం చంద్రబాబు నాయుడు..
ఉదయం 10 గంటలకు పోలవరం రానున్న సీఎం..
ప్రాజెక్టు పరిశీలన, అనంతరం అధికారులతో సమావేశం..
మధ్యాహ్నం 2గంటలకు పోలవరం నుంచి రాజమండ్రి వెళ్లనున్న చంద్రబాబు..
రాజమండ్రి నుంచి మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్న సీఎం చంద్రబాబు.
-
Jan 07, 2026 06:07 IST
మంటల్లో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు..
తూ.గో.: కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి దగ్గర ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం..
షార్ట్‌సర్క్యూట్‌తో RRR ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు, బస్సు దగ్ధం..
డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం, 10 మంది ప్రయాణికులు సురక్షితం..
ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న RRR ట్రావెల్స్ బస్సు.