-
-
Home » Mukhyaamshalu » Andhrapradesh Telangana National International news ABN Andhrajyothy Live Updates of 5th March 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 05 , 2026 | 07:48 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 05, 2026 10:25 IST
మేడ్చల్: మౌలాలి కమాన్ దగ్గర ఆందోళన
ఖమేనీకి మద్దతుగా వెలిసిన ఫ్లెక్సీలు
ఫ్లెక్సీలను చించేసిన యువకులు, దాడికి దిగిన స్థానికులు
యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Mar 05, 2026 10:19 IST
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
రూ.980 తగ్గి రూ.1,63,530కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
రూ.900 తగ్గి రూ.1,49,900కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,95,000
-
Mar 05, 2026 10:16 IST
అమరావతి: ఏపీ శాసన మండలి కొద్ది సేపు వాయిదా
వైసీపీ ఆందోళనతో సభ వాయిదా వేసిన చైర్మన్
-
Mar 05, 2026 10:15 IST
అమరావతి: ఏపీ శాసన మండలి ప్రారంభం
శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం
కళంకిత ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్‌ను పదవి నుంచి తప్పించాలని తీర్మానం
వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్
సభలో వైసీపీ సభ్యుల ఆందోళన
చైర్మన్ పోడియం వద్ద నినాదాలు
-
Mar 05, 2026 09:41 IST
టీ 20వరల్డ్ కప్‌లో నేడు రెండో సెమీ ఫైనల్ మ్యాచ్
సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత జట్టు
ముంబై వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభం
సెమీస్‌లో గెలిచి ఫైనల్స్ వెళ్ళాలన్న పట్టుదలతో టీమిండియా
ఇప్పటికే ఫైనల్స్‌కు చేరిన న్యూజిలాండ్
-
Mar 05, 2026 09:39 IST
హోలీ పండుగ రోజున దారుణం
మీద రంగు చల్లాడని మనువడిపై వేడి నీళ్లు పోసిన బామ్మ
45 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన పిల్లాడు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఘటన
-
Mar 05, 2026 09:27 IST
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్ 370, నిఫ్టీ 110 పాయింట్లకు పైగా లాభం
-
Mar 05, 2026 09:27 IST
ఇరాన్ సుప్రీం లేడర్ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా
భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో నిర్ణయం
వెల్లడించిన ఇస్లామిక్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధిపతి మహసిన్ మహముది
త్వరలో అంత్యక్రియల తేదీలు ప్రకటించనున్న ప్రభుత్వం
-
Mar 05, 2026 09:26 IST
జెన్‌జెడ్ ఆందోళనల తర్వాత తొలిసారిగా నేపాల్‌లో నేడు పోలింగ్
ఓటింగ్‌లో పాల్గొననున్న 18.9 మిలియన్ల మంది ఓటర్లు
-
Mar 05, 2026 09:25 IST
కెనడా యుద్ధంలో పాల్గొనదు: ప్రధాని మార్క్ కార్నీ
పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం: మార్క్ కార్నీ
ఉగ్రవాదానికి, అస్థిరతకు మూలం ఇరాన్: మార్క్ కార్నీ
-
Mar 05, 2026 09:24 IST
హనుమకొండ: హిస్సార్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
ఇంజిన్ వీల్ విరిగిపోవడంతో రైలు నిలిపివేత
మరో ఇంజిన్ ద్వారా ఉప్పల్ రైల్వేస్టేషన్‌కు తరలింపు
రాత్రి 2 గంటల నుంచి నిలిచిపోయిన రైలు
-
Mar 05, 2026 09:09 IST
రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు
విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావలసిన..
ఇండిగో విమాన సర్వీసు 90 నిమిషాలు ఆలస్యం
-
Mar 05, 2026 09:01 IST
ఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు
వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ పేర్లు ప్రకటన
వీరి పేర్లను అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్య సభ స్థానాలు

-
Mar 05, 2026 08:58 IST
గుంటూరు: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు
నేడు ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు వచ్చే అవకాశం
హైకోర్టు ఆదేశాలతో విచారణకు రానున్న సునీల్ నాయక్
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో A7 గా ఉన్న సునీల్ నాయక్
-
Mar 05, 2026 08:57 IST
నేడు తిరుమలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి బయల్దేరనున్న కవిత
మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు బయల్దేరనున్న కవిత
రేపు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం
-
Mar 05, 2026 08:57 IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఊరట
సెనెట్‌లో వీగిపోయిన విపక్షాల తీర్మానం
ఇరాన్‌పై యుద్ధంలో కాంగ్రెస్ అనుమతి లేకుండా..
బలగాలను రంగంలోకి దించకూడదని విపక్షాల తీర్మానం
53-47 ఓట్ల తేడాతో ప్రతిపాదన తిరస్కరణ
-
Mar 05, 2026 08:53 IST
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగుల నిరసన
నిరవధిక సమ్మెకు దిగుతున్న ఉద్యోగుల ట్రేడ్ యూనియన్
OT బకాయిలు, అలవెన్సులు చెల్లించాలని డిమాండ్
-
Mar 05, 2026 08:51 IST
ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, మిస్సైల్స్‌తో టెహ్రాన్ దాడులు
పశ్చిమాసియాలో మౌలికవసతులే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు
మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరిక
హర్ముజ్ జలసంధి మూసివేతతో ఎక్కడికక్కడ నిలిచిన నౌకలు
యుద్ధం దృష్ట్యా ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా
-
Mar 05, 2026 08:07 IST
లిక్కర్ కేసులో చాణక్య ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
రూ.8 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 11.29 ఎకరాల స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించిన సిట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ8గా ఉన్న చాణక్య
-
Mar 05, 2026 08:06 IST
యుద్ధం నేపథ్యంలో భారత్‌లో 12 వందలకుపైగా విమానాలు రద్దు
ముంబై, ఢిల్లీ, బెంగళూరులో నిన్న ఒక్కరోజే 180 విమానాలు రద్దు
గతనెల 28 నుంచి మార్చి 3 వరకు 500 విమానాలు రద్దు చేశామన్న ఇండిగో
నిన్న శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు 33 విమాన సర్వీసులు రద్దు
-
Mar 05, 2026 07:48 IST
నేడు 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
JNTU సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి లోకేష్
మోటారు వాహనాల పన్ను విధింపు బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి రాంప్రసాద్
మండలిలో లడ్డూ అంశంపై కొనసాగనున్న చర్చ