-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 30th October 2026 avn
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 30 , 2026 | 07:44 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 30, 2026 09:00 IST
ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం పినపాక రోడ్డులో స్కూల్ బస్ బోల్తా
డ్రైవర్‌కు గాయాలు, పిల్లలు సురక్షితం
ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 16 మంది విద్యార్థులు
బస్సులో నుంచి పిల్లలను సురక్షితంగా బయటకు తీసిన గ్రామస్తులు
ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు
గాయలైన డ్రైవర్, విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు
విద్యార్థులంతా చెవుటూరు, ఆత్కూరుకు చెందిన వారు
ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు
-
Oct 30, 2026 08:59 IST
ప.గో జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
రెండు గంటలు ముందుగానే ప్రారంభం కానున్న సీఎం పర్యటన
ఉదయం గం.10:30కు మొగల్తూరు హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక
తర్వాత రోడ్డు మార్గంలో నవరసపురం గ్రామానికి బయలుదేరనున్న సీఎం
గం.11:10 కు మాతృవు గ్రామానికి చోరుకోనునన్న సీఎం
గం.12:05 కు మాతృవులోని తుపాను పునరావాస కేంద్రానికి సీఎం
గం.12:05 నుంచి 12:25 వరకు బాధితులతో సీఎం ముఖాముఖి
గం.12:25 నుంచి 12:40 వరకు మీడియాతో మాట్లాడనున్న సీఎం
-
Oct 30, 2026 08:52 IST
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆర్నబ్’ తుపాను సృష్టించిన విధ్వంసంపై రాహుల్ గాంధీ ఆందోళన
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఒడిశా పరిస్థితులపైనా ఆవేదన
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
ఇళ్లు, జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సంఘీభావం
ఈ విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలందరికీ తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి
బాధితులకు వేగంగా పునరావాస చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాహుల్ గాంధీ సూచన
-
Oct 30, 2026 08:44 IST
అమరావతి: సీఎం చంద్రబాబు సూచనలతో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రికి మంత్రి గొట్టిపాటి ఫోన్
తుపాను అర్నబ్ మిగిల్చిన నష్టాన్ని తమిళనాడు మంత్రికి వివరించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడు సాయం కోరిన మంత్రి
విద్యుత్ సిబ్బంది, సామాగ్రిని ఏపీకి పంపేందుకు సుముఖత వ్యక్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం
ఇప్పటికే విద్యుత్ పునరుద్ధరణ చర్యల కోసం తెలంగాణ సాయం కోరిన ఏపీ ప్రభుత్వం
తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి వచ్చి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తున్న తెలంగాణ సిబ్బంది
-
Oct 30, 2026 08:34 IST
అమరావతి: గాదె సాయికృష్ణ కేసులో సీబీఐ కీలక విచారణ
సాయికృష్ణ మృతిపై నిజాలు తేల్చాలంటూ తల్లి విజయలక్ష్మి వేడుకోలు
నా కొడుకును ఎందుకు చంపారో మీరే తేల్చాలి.. సీబీఐకి తల్లి విజ్ఞప్తి
నాకు కడుపుకోత మిగిల్చిన వారందరిపైనా చర్యలు తీసుకోవాలి..
కస్టోడియల్ టార్చర్, లాకప్ డెత్, మృతదేహం మాయం కేసులో దర్యాప్తు
ఏడో రోజు విచారణలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి
విజయవాడ ఆటోనగర్ సమీపంలోని సీబీఐ కార్యాలయంలో విచారణ
మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగిన విచారణ
ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్, స్వర్గపురి, పాడుబడిన భవనాన్ని పరిశీలించిన సీబీఐ
-
Oct 30, 2026 08:15 IST
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన ఇంద్రవెల్లి పాంచజన్య సంకల్ప సభకు సర్వం సిద్ధం
అట్టహాసంగా ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు..15 వేల మంది ప్రజలు కూర్చునేలా ఏర్పాట్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్న పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇంద్రవెల్లిలో సంకల్ప సభ
-
Oct 30, 2026 08:10 IST
హైదరాబాద్: ఢిల్లీ బయల్దేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
నవంబర్ 1న ఛలో ఢిల్లీ కార్యక్రమం
ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్ళను అడిగిన టీపీసీసీ
ప్రత్యేక రైళ్లు ఇవ్వని రైల్వే శాఖ
బస్సుల్లోనే ఢిల్లీ బయల్దేరుతున్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణ నుంచి దాదాపు వంద బస్సుల్లో ఢిల్లీకి కదులుతున్న హస్తం నేతలు
-
Oct 30, 2026 07:20 IST
ఢిల్లీ: నేడు మ.3 గంటలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఇండియా కూటమి ‘జన మహాభియోగ్’ (పీపుల్స్ ఇంపీచ్‌మెంట్)
‘మాక్ పార్లమెంట్’ కాకుండా ప్రజా అభిశంసనగా పేరు మార్పు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కార్యక్రమం
మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జన మహాభియోగ్
మధ్యాహ్నం గం.3 నుంచి సా.7.30 వరకు పీపుల్స్ ఇంపీచ్‌మెంట్
-
Oct 30, 2026 06:50 IST
విశాఖపట్నం: ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనున్న జీవీఎంసీ ఎన్నికల ప్రచారం
గడువు ముగిసిన తర్వాత మైకులు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు: కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
-
Oct 30, 2026 06:10 IST
అమరావతి: నేడు ప.గో. జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన
మధ్యాహ్నం గం.12:00 ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న చంద్రబాబు
మధ్యాహ్నం గం.12:45 కు మొగల్తూరు హెలిప్యాడ్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి
మధ్యాహ్నం 1:40 వరకు నరసాపురం మండలం నవరసపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం