-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 26th September 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 26 , 2026 | 07:18 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 26, 2026 08:33 IST
హైదరాబాద్: అంబర్‌పేట్ ఇరానీ హోటల్ దగ్గర ట్రాఫిక్ జామ్
గుంతలో దిగబడిన గణనాథుడి వాహనం, నిలిచిన రాకపోకలు
వాహనాన్ని గుంతలోంచి బయటకు తీసేందుకు నిర్వాహకుల యత్నం
రోడ్డుపై భారీగా నిలిచిన గణనాథుల వాహనాలు
అంబర్‌పేట్ ఫ్లైఓవర్ దగ్గర అధ్వానంగా రోడ్డు
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసుల చర్యలు
-
Sep 26, 2026 08:32 IST
విశాఖ జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ బాధ్యతల స్వీకరణ
-
Sep 26, 2026 08:31 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి సురేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్
-
Sep 26, 2026 08:31 IST
ప్రకాశం: సంతమాగులూరు మం. ఏల్చూరులో దారుణం
భార్య, అత్త గొంతు కోసిన భర్త, మరిది
ఘటనలో అత్త భ్రమ్మేశ్వరి మృతి, భార్య నారాయణమ్మ పరిస్థితి విషమం
భార్య, అత్తపై హత్యకు యత్నించిన వసంతరాయుడు, అనిల్
-
Sep 26, 2026 08:29 IST
విజయనగరం: విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ వేటు
విధుల్లో నిర్లక్ష్యం వహించిన వంగర తహసీల్దార్ రామారావు సస్పెన్షన్
సంగాం వీఆర్వో రామచంద్రరావు, వంగర వీఆర్‌ఏ ఉదయ్‌కిరణ్ సస్పెన్షన్
వంగర ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా రీసర్వే డీటీ శ్రీనివాసరావు నియామకం
-
Sep 26, 2026 08:29 IST
కాకినాడ: చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్
హావ్‌డై-చెన్నై రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులు
-
Sep 26, 2026 08:28 IST
వికారాబాద్: పరిగిలో వినాయక నిమజ్జనంలో దారుణం
ఊరేగింపులో కానిస్టేబుల్ నర్సింహులుపై కత్తితో దాడి
ఇరువర్గాల మధ్య ఘర్షణ ఆపే యత్నం చేసిన కానిస్టేబుల్‌పై దాడి
కానిస్టేబుల్ ఛాతీ భాగంలో తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
యువకుడు తరుణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Sep 26, 2026 08:27 IST
కర్నూలు: సుంకేసుల డ్యామ్‌కు జలకళ
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు సుంకేసుల ప్రాజెక్టుకు వరదలు
ఇన్ ఫ్లో 2500 క్యూసెక్కులు
ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయి నీటిమట్టం 1.2 టీఎంసీలకు చేరుకునే అవకాశం
మరో ఏడు రోజులపాటు వరద కొనసాగే అవకాశం ఉందని తెలిపిన ఇరిగేషన్ అధికారులు
-
Sep 26, 2026 08:27 IST
షూటింగ్‌లో భారత్‌కు రజత పతకం
రజతం సాధించిన తిలొత్తమ సేన్, ఆశి చౌక్సే, విదర్శ కే. వినోద్ జట్టు
1763 పాయింట్లతో రెండో స్థానంలో భారత్
1773 పాయింట్లతో చైనాకు స్వర్ణ పతకం
వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించిన తిలొత్తమ, విదర్శ
ఉదయం 9:30 గంటలకు వ్యక్తిగత ఫైనల్
-
Sep 26, 2026 07:46 IST
విశాఖ: భీమునిపట్నంలో ప్రేమపెళ్లి నేపథ్యంలో కత్తులతో దాడి
భీమునిపట్నం మం. మజ్జిపేటకు చెందిన యువకుడిపై కత్తులతో దాడి
ఘర్షణను చిత్రీకరిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ ఆనంద్‌పైనా కత్తితో దాడి
కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న భీమునిపట్నం పోలీసులు
-
Sep 26, 2026 07:45 IST
నేడు కరీంనగర్‌లో పశువుల బీమా పథకం ప్రారంభం
పాడిగేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల బీమా పథకానికి శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం
పశువుల బీమా పథకం ప్రారంభించనున్న వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్
-
Sep 26, 2026 07:45 IST
దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం
నేడు అల్పపీడనంగా బలహీనపడే అవకాశం
ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు అతి భారీ వర్షాలు
-
Sep 26, 2026 07:45 IST
హైదరాబాద్: నేడు శిల్పారామంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం
తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం
వివిధ విభాగాల్లో పర్యాటక ఎక్సలెన్స్ అవార్డులు
పర్యాటక దినోత్సవానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Sep 26, 2026 07:27 IST
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,54,850
22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,40,110
కిలో వెండి ధర రూ.2,44,900
-
Sep 26, 2026 07:26 IST
గణేశుడి నిమజ్జనం ప్రత్యక్ష ప్రసారం..
-
Sep 26, 2026 07:21 IST
తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు
రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదు
గతేడాదితో పోలిస్తే ఈసారి పెరిగిన విగ్రహాల సంఖ్య
ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో విగ్రహాలతో కలిపి 4 లక్షల వరకు ఉండే అవకాశం
-
Sep 26, 2026 07:20 IST
హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం
ట్యాంక్‌బండ్ దగ్గర రాత్రంతా నిమజ్జనాలు
మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం
ఎంజే మార్కెట్ దగ్గర బారులు తీరిన గణనాథులు
ఇప్పటివరకు లక్ష విగ్రహాలకు పైగా నిమజ్జనం
-
Sep 26, 2026 07:18 IST
కర్నూలు: నేడు ఓరియంట్ ఏవియేషన్ అకాడమీ ప్రారంభోత్సవం
పాల్గొననున్న కేంద్రమంత్రి రామ్మోహన్, మంత్రులు భరత్, జనార్దన్‌రెడ్డి