-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 26th June 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 26 , 2026 | 07:09 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 26, 2026 21:42 IST
ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి
మొదటి టి20లో టీమిండియా పరాజయం
34 పరుగుల తేడాతో భారత్‌పై ఐర్లాండ్ విజయం
స్కోర్లు: ఐర్లాండ్ 182/9, భారత్ 148 (18.5 ఓవర్లు)
టీ20లో టీమిండియాపై మొదటిసారి గెలిచిన ఐర్లాండ్
-
Jun 26, 2026 21:04 IST
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి
సాయికృష్ణ మిస్సింగ్ కేసును CBI లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని హైకోర్టులో పిటిషన్
-
Jun 26, 2026 21:02 IST
సాయికృష్ణ కేసులో ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం
జీవించే హక్కుపై దాడిగా పేర్కొన్న NHRC
ఏపీ డీజీపీ, విజయవాడ సీపీలకు NHRC నోటీసులు
డిలీట్ చేసిన సీసీ ఫుటేజ్‌ను రికవరీ చేయాలి: NHRC
మృతుడి అస్థికలను వెలికితీయాలి: NHRC
-
Jun 26, 2026 20:35 IST
ఖమ్మం: పెనుబల్లి మం. యడ్లబంజర్‌లో వ్యాన్ బీభత్సం
అతివేగంతో రెండు బైక్‌లపైకి దూసుకెళ్లిన వ్యాన్
ఒకరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
-
Jun 26, 2026 20:31 IST
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై MLC విజయశాంతి ట్వీట్
ఫీజు బకాయిలపై హైకోర్టు ఉత్తర్వులు అమలుచేయాలి
ప్రభుత్వం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి
కాలేజీలు ప్రమాణాలు పాటించాలి: MLC విజయశాంతి
-
Jun 26, 2026 20:09 IST
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
భూకంప తీవ్రత 6.5గా నమోదు
-
Jun 26, 2026 19:42 IST
మిసైల్ దాడి అలర్ట్‌లు.. దుబాయ్‌లో కలకలం
అకస్మాత్తుగా ప్రజల ఫోన్లకు అలర్ట్‌లు
ఏం జరుగుతోందో అర్థం కాక ప్రజల్లో టెన్షన్
అలర్టులను పట్టించుకోవద్దంటూ.. కొన్ని నిమిషాలకు మళ్లీ సందేశాలు
దేశంలో సాధారణ పరిస్థితులే ఉన్నాయన్న అంతర్గత వ్యవహారాల శాఖ
-
Jun 26, 2026 19:25 IST
కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి అచ్చెన్న టెలికాన్ఫరెన్స్
పొగాకు గిట్టుబాటు ధరకు ప్రభుత్వం భరోసా: మంత్రి అచ్చెన్న
పొగాకు మార్కెట్ పరిస్థితులపై నిరంతర నిఘా: మంత్రి అచ్చెన్న
పొగాకు రైతుల సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్న
పొగాకు రైతులకు నష్టం జరగకుండా చూడాలి: మంత్రి అచ్చెన్న
పొగాకు కిలో రూ.200కి తగ్గకుండా చూడాలి: మంత్రి అచ్చెన్న
-
Jun 26, 2026 19:24 IST
నల్లగొండలో నలుగురి హత్య కేసును ఛేదించిన పోలీసులు
నలుగురిని హత్య చేసింది హతురాలి అక్క అల్లుడిగా గుర్తింపు
హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు
-
Jun 26, 2026 19:23 IST
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్‌లో విషాద ఘటన
ట్రాక్టర్‌కు సంబంధించిన ఇనుప చక్రాలు మీద పడి చిన్నారి అభిరామి (4) మృతి
-
Jun 26, 2026 19:22 IST
చెన్నై: సీఎం విజయ్ 'జననాయగన్' సినిమా నిర్మాతకు కీలక బాధ్యతలు
నిర్మాత వెంకట నారాయణకు కీలక బాధ్యతలు అప్పగించిన తమిళనాడు ప్రభుత్వం
ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం
-
Jun 26, 2026 19:21 IST
అనకాపల్లి: మాడుగుల మండలం కృష్ణాపురం గ్రామంలో విషాద ఘటన
పామాయిల్ తోటలో పని చేస్తుండగా వ్యక్తికి పాము కాటు
ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి
మృతుడు వీరనారాయణం గ్రామానికి చెందిన మద్దాల శ్రీను
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 26, 2026 19:00 IST
ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్
పాస్‌పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి ప్రామాణికం కాదు: కిషన్‌రెడ్డి
పాస్‌పోర్ట్‌పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కిషన్‌రెడ్డి
పౌరసత్వాన్ని నిర్ణయించేది రాజ్యాంగం, చట్టమే: కిషన్‌రెడ్డి
-
Jun 26, 2026 18:37 IST
మహిళా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఘటన
టేబుల్ మీద కాళ్లు పెట్టి నిర్లక్ష్యంగా కూర్చున్న కానిస్టేబుల్ ఫొటో వైరల్
వృద్ధుడి ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు
కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామన్న జిల్లా పోలీసు అధికారులు
-
Jun 26, 2026 18:26 IST
ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్ జిల్లాలో కూంబింగ్
మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
రూ.24 లక్షలు, 11 ఆయుధాల సీజ్
-
Jun 26, 2026 18:25 IST
జులైలో భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
జులై 1 నుంచి 3 వరకు జపాన్ ప్రధాని టకైచి భారత్ టూర్
-
Jun 26, 2026 18:25 IST
ప.గో: కాళ్ల మండలం వేంపాడు కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
దట్టంగా అలుముకున్న పొగ
మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది
-
Jun 26, 2026 18:09 IST
ఏపీలో జీరో స్థాయికి గంజాయి సాగు: హోం మంత్రి అనిత
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయి రవాణాపై ఈగల్ నిఘా
గంజా వినియోగదారులకు డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స
జైళ్లలోనూ డీ-అడిక్షన్ కార్యక్రమాల అమలు: హోం మంత్రి అనిత
-
Jun 26, 2026 18:08 IST
సనత్‌నగర్‌లో కల్ట్‌ఫిట్ కేసులో మరో అరెస్ట్
జిమ్‌కు వస్తున్న మహిళలకు ట్రైనర్ వేధింపులు
మహిళా పైలట్‌తో పాటూ నలుగురు మహిళలకు వేధింపులు
మహిళలను వేధిస్తున్న ట్రైనర్లు సంతోష్, హరీష్
ఇప్పటికే సంతోష్, హరీష్ అరెస్ట్
సంతోష్‌కు సహకరిస్తున్న గర్ల్‌ఫ్రెండ్ రజని అరెస్ట్
మహిళా పైలట్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
-
Jun 26, 2026 17:43 IST
IND VS IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్
తుది జట్టులో వైభవ్‌కు దక్కని చోటు
భవిష్యత్‌లో అతడికి అవకాశం వస్తుంది: అయ్యర్
-
Jun 26, 2026 17:35 IST
IND VS IRE: టాస్ నెగ్గిన భారత్
నేడు భారత్, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్
తొలుత బ్యాటింగ్ చేయనున్న ఐర్లాండ్
మరికాసేపట్లో ప్రారంభంకానున్న మ్యాచ్
-
Jun 26, 2026 17:16 IST
అయోధ్య ట్రస్ట్ విరాళాల చోరీ కేసు
8 మంది నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్
3 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు.. ఫైజాబాద్ జైలుకు తరలింపు
నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు
-
Jun 26, 2026 17:07 IST
ఖమ్మం: వేంసూరు మండలం కల్లూరుగూడెంలో మంత్రి తుమ్మల
నిర్మాణంలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించిన తుమ్మల
పదవులు ముఖ్యం కాదు.. మనం చేసే పనులు కనపడాలి: తుమ్మల
ఆగస్టు 15 నాటికి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించడమే లక్ష్యం: మంత్రి తుమ్మల
-
Jun 26, 2026 17:06 IST
ఫ్రాన్స్‌లో ఏసీల కోసం ఎగబడుతున్న జనం
ఎండ వేడికి అల్లాడిపోతున్న ఫ్రాన్స్ ప్రజలు
ఏసీలు, కూలర్లకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్
దుకాణాలు తెరవకముందే కొనుగోలుదారుల క్యూలు
ఉష్ణోగ్రత పెరగడంతో జోరందుకున్న ఏసీలు, కూలర్ల విక్రయాలు
-
Jun 26, 2026 16:52 IST
మాదాపూర్ శిల్పకళా వేదికలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం తదితరులు
-
Jun 26, 2026 16:48 IST
ఓడిపోతే రెస్ట్ తీసుకుంటా అని KCR ప్రకటించారు: అద్దంకి
చెప్పినట్లుగానే ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు: అద్దంకి దయాకర్
KCRను BRS నేతలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
-
Jun 26, 2026 16:47 IST
తెలంగాణకు IMD ఆరెంజ్ అలర్ట్
పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
రేపటి నుంచి జులై 2 వరకు వర్షాలు
2 రోజుల్లో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
-
Jun 26, 2026 16:47 IST
వెనెజువెలాకు భారత్ భారీ సాయం
35 టన్నుల నిత్యావసరాలు పంపిన భారత్
రెండు IAF విమానాల్లో సామగ్రి తరలింపు
భూకంప బాధిత వెనెజువెలాకు భారత్ సాయం
-
Jun 26, 2026 16:45 IST
అమరావతి: తాగునీరు, పారిశుద్ధ్యంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అధికారులు ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించాలి: పవన్
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి: పవన్
ప్రజారోగ్య పరిరక్షణే అత్యంత ప్రాధాన్యం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jun 26, 2026 16:07 IST
తెలంగాణ అటవీ శాఖలో కీలక మార్పులు
హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ డా.సి.సువర్ణ పదవీ విరమణ
జూన్ 30 నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు
వినయ్ కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
-
Jun 26, 2026 15:26 IST
తెలంగాణలో 13 మంది IASలు బదిలీ
సీఎం ముఖ్య కార్యదర్శిగా N.శ్రీధర్
విపత్తు నిర్వహణ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలు
అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్
దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌కు అదనపు బాధ్యతలు
-
Jun 26, 2026 15:24 IST
చిన్నారిని ఛాతిపై తన్నిన అంగన్‌వాడీ వర్కర్
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్
కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
-
Jun 26, 2026 15:22 IST
విశాఖ: రాధా గాయత్రి కేసులో బిగ్ ట్విస్ట్
5 రోజులుగా కనపడకుండా పోయిన శ్రీచరణ్
మీడియాకు స్పందించిన శ్రీచరణ్ తల్లి సీతామహాలక్ష్మి
నా బిడ్డ ఎలాంటి తప్పూ చేయలేదు: తల్లి సీతామహాలక్ష్మి
నా బిడ్డ తప్పు చేస్తే మేమే ప్రాణాలు తీసుకుంటాం: సీతామహాలక్ష్మి
నా బిడ్డ లాయర్ చెప్పినట్టు నడుచుకుంటున్నాడు: సీతామహాలక్ష్మి
-
Jun 26, 2026 15:22 IST
ఫిఫా ప్రపంచకప్‌లో అరుదైన ఘనత సాధించిన జపాన్ స్టార్ యుటో నగటోమో
ఐదోసారి ఫిఫా ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన యుటో
ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఫుట్‌బాల్ ఆటగాడిగా రికార్డు
ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయి అందుకున్న పదో ఆటగాడిగా నిలిచిన యుటో
-
Jun 26, 2026 15:17 IST
ఉక్రెయిన్-రష్యా మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు
రష్యాలోని 12 ప్రాంతాలపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి
ఒకేసారి 660 డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్
డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నట్లు రష్యా ప్రకటన
-
Jun 26, 2026 15:16 IST
హైదరాబాద్: మ్యాట్రిమోనీ కేసును ఛేదించిన పోలీసులు
తెలంగాణకు చెందిన నలుగురి అరెస్టు
సంగం మ్యాట్రిమోనీ పేరుతో రూ.1.46 కోట్ల మోసం
నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు
బాధితుడి నుంచి రూ.46.65 లక్షలు కొట్టేసిన నిందితులు
మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బు మళ్లింపు
-
Jun 26, 2026 14:46 IST
ఢిల్లీ: నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ సమావేశం
డ్రగ్స్‌పై యుద్ధం తీవ్రతరం చేయాలి: అమిత్ షా
వికసిత్ భారత్ లక్ష్య సాధనలో డ్రగ్స్ నిర్మూలన కీలకం
డ్రగ్స్‌పై పోరాటంలో రానున్న మూడేళ్లు కీలకం: అమిత్ షా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
-
Jun 26, 2026 14:43 IST
తెలంగాణ CSగా సంజయ్ జాజు
సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ IAS సంజయ్ జాజు
3 రోజుల క్రితం కేంద్ర సర్వీస్‌ల నుంచి సంజయ్ జాజు రిలీవ్
1992 బ్యాచ్ IAS అధికారి సంజయ్ జాజు
-
Jun 26, 2026 14:28 IST
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణలో అందరూ భాగస్వామ్యం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి
అవగాహనతోనే డ్రగ్స్ నియంత్రణ సాధ్యం: సీఎం రేవంత్
డ్రగ్స్‌పై యువతలో అప్రమత్తత పెంచాలి: సీఎం రేవంత్
డ్రగ్స్‌పై సమష్టి పోరాటమే శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
-
Jun 26, 2026 14:04 IST
ఏపీని డ్రగ్స్‌రహితంగా మార్చేందుకు సహకరించండి: హోం మంత్రి అనిత
ఈగల్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి: అనిత
ఎక్కడో చెట్టు కింద కూర్చొని గంజాయి తీసుకున్నా డ్రోన్ పట్టేస్తుంది: అనిత
యువత.. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు: అనిత
-
Jun 26, 2026 14:03 IST
యూపీ: అయోధ్య విరాళాల కేసుపై స్పందించిన సీఎం యోగి
సిట్ నివేదిక తర్వాత చర్యలు ప్రారంభిస్తాం: యోగి ఆదిత్యనాథ్
నిజాన్ని వెలికితీస్తాం.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: యోగి
-
Jun 26, 2026 13:55 IST
వైభవ్ సూర్యవంశీ హవా.. క్షణాల్లో అమ్ముడైన టికెట్లు
యువ క్రికెటర్ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐర్లాండ్ అభిమానులు
టికెట్లు క్షణాల్లోనే సేల్ అయినట్లు వెల్లడించిన ఐర్లాండ్ క్రికెట్ ఛైర్మన్
వైభవ్‌కు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణ
అభిమానుల స్పందనతో మ్యాచ్‌పై భారీ అంచనాలు
వైభవ్ ప్రభావం టికెట్ విక్రయాల్లోనూ స్పష్టమైందన్న బ్రియాన్ మాక్‌నీస్
-
Jun 26, 2026 13:20 IST
అయోధ్య విరాళాల కేసులో కీలక పరిణామం
అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్ రాజీనామా
మరోవైపు చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ అరెస్ట్
కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన సిట్
-
Jun 26, 2026 13:09 IST
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న వైభవ్
భారత బౌలర్లతో కలిసి ప్రాక్టీస్ సెషల్‌లో పాల్గొన్న వైభవ్
వైభవ్ ప్రాక్టీస్ సెషన్ వీడియోలను పోస్ట్ చేసిన బీసీసీఐ
తొలిసారి టీమిండియా తరఫున బరిలోకి దిగనున్న వైభవ్
-
Jun 26, 2026 13:07 IST
కాకినాడ: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు అప్‌డేట్
డీహైడ్రేషన్‌తోనే కుక్క మృతి చెందినట్లు వైద్యుల ధ్రువీకరణ
ఎలాంటి విష ప్రయోగం జరుగలేదని వెల్లడించిన ఫోరెన్సిక్ నివేదిక
ఈ నెల 6వ తేదీన చిన్నారితో పాటు 3 రోజులు పెంపుడు కుక్క అదృశ్యం
-
Jun 26, 2026 13:05 IST
ఏపీలో డ్రగ్స్‌కు చోటు లేదు: సీఎం చంద్రబాబు
డ్రగ్ ట్రాఫికింగ్‌పై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకెళ్తున్నాం: సీఎం
డ్రగ్స్‌పై పోరాటం అంటే.. యువత భవిష్యత్‌ను కాపాడటం: సీఎం
ఏపీలో డ్రగ్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయి: సీఎం
-
Jun 26, 2026 13:03 IST
రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు
క్రిమియాతో పాటు రష్యాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న కీవ్
వందల సంఖ్యలో డ్రోన్లతో దాడులు జరిపినట్లు సమాచారం
మొత్తం 660 డ్రోన్లను కూల్చివేసినట్లు మాస్కో ప్రకటన
వైమానిక రక్షణ వ్యవస్థలు దాడులను సమర్థంగా తిప్పికొట్టాయని రష్యా వెల్లడి
-
Jun 26, 2026 12:43 IST
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, రూ.24లక్షల నగదు సీజ్
నారాయణ్‌పూర్ జిల్లా టెక్లా అటవీ ప్రాంతంలో డంప్ గుర్తింపు
-
Jun 26, 2026 12:37 IST
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక ప్రకటన
సెక్షన్ 301 దర్యాప్తు పూర్తయితే తిరిగి పాత టారిఫ్‌ల అమలు
సెక్షన్ 122 కింద విధించిన టారిఫ్‌లు జులై 24 వరకు అమలు
-
Jun 26, 2026 12:35 IST
కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై కొనసాగుతున్న ఉత్కంఠ
ఆదివారం లేదా సోమవారం కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరిగే చాన్స్
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిన్న కలిసిన హోంమంత్రి అమిత్ షా
మంత్రివర్గ విస్తరణకు అనుకూల తేదీలపై చర్చించిన అమిత్ షా
-
Jun 26, 2026 12:34 IST
మరోసారి మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వివాదం
14 గ్రామాల్లో నిలిచిన SIR ప్రక్రియ
ఏ రాష్ట్రం పరిధిలో ఉన్నామో తేల్చాలంటున్న గ్రామస్తులు
కొమురంభీం, చంద్రాపూర్ జిల్లాల మధ్య ఉన్న గ్రామాలు
అంతాపూర్, భోలాపటార్, పరందోళితో పాటు ముకదంగూడ పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామాలు
ఇరు రాష్ట్రాల అధికారులు వచ్చే వరకు ఎన్యుమరేషన్ ఫామ్‌లు తీసుకోబోమంటున్న ప్రజలు
-
Jun 26, 2026 12:33 IST
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం
ఇద్దరు వ్యక్తుల నుంచి 2.271 కిలోల బంగారం స్వాధీనం
కౌలాలంపూర్ నుంచి బంగారం తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులు
-
Jun 26, 2026 12:32 IST
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చర్లపల్లి జైలు ఖైదీ మృతి
25 జూన్ మధ్యాహ్నం 2:33 గంటలకు ఖైదీ మృతిచెందినట్టు వైద్యుల ప్రకటన
అత్యాచారం కేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న ఖైదీ సొన్న అడెల్లు
-
Jun 26, 2026 12:15 IST
జూన్ 30 వరకు ఈపీఎఫ్‌వో పోర్టల్ సేవలకు అంతరాయం
జూన్ 26 అర్ధరాత్రి నుంచి జూన్ 29 రాత్రి 11:59 వరకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు నిలిపివేత
సిస్టమ్ అప్‌గ్రేడ్, నిర్వహణ పనుల నేపథ్యంలో తాత్కాలికంగా సేవల నిలిపివేత
ఈ సమయంలో పలు కీలక ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవని ఈపీఎఫ్‌వో ప్రకటన
జూన్ 30 అర్ధరాత్రి నుంచి సేవలు పునరుద్ధరించనున్నట్లు వెల్లడి
అవసరమైన ఈపీఎఫ్‌వో సేవలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సభ్యులకు సూచన
-
Jun 26, 2026 12:09 IST
టెక్ స్టాక్స్‌లో భారీ అమ్మకాలతో ఆసియా మార్కెట్లకు షాక్
దక్షిణ కొరియా కోస్సీ సూచీ 8 శాతం పతనం
జపాన్ నిక్కీ సూచీ 5 శాతం నష్టాల్లో ముగింపు
టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో ఇన్వెస్టర్లలో ఆందోళన
ఆసియా ప్రధాన మార్కెట్లు భారీ నష్టాలు నమోదు
ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిన టెక్ స్టాక్స్ అమ్మకాలు
-
Jun 26, 2026 11:59 IST
‘ఆపరేషన్ సిందూర్’ అమరుల పేర్లు ప్రకటించిన కేంద్రం
నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన
'ఆపరేషన్ సిందూర్'లో దేశం కోసం పోరాడుతూ ఐదుగురు ఆర్మీ అధికారులతో పాటు ఓ అగ్నివీర్ వీరమరణం
సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్‌నాయక్ దినేష్ కుమార్, హవల్దార్ సునీల్‌కుమార్ సింగ్, సార్జెంట్ సురేంద్ర కుమార్, అగ్నివీర్ మురళీ నాయక్
-
Jun 26, 2026 11:55 IST
అనంతపురం వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు
తాడిపత్రికి బయలుదేరిన జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
వైసీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
పోలీసులతో వాగ్వాదానికి దిగిన వైసీపీ నేతలు, కార్యకర్తలు
-
Jun 26, 2026 11:46 IST
మధ్యప్రదేశ్: అశోక్‌నగర్‌లో పార్క్ చేసిన కారులో మృతదేహాల కలకలం
కారులో ఇద్దరు యువతీయువకుల మృతదేహాలను గుర్తించిన పోలీసులు
బుల్లెట్ గాయాలు, శరీరంపై కాలిన గాయాలతో మృతదేహాలు లభ్యం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jun 26, 2026 11:26 IST
హైదరాబాద్: మియాపూర్ సీఐ శివప్రసాద్‌పై వేటు
సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు
సైబరాబాద్ సీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన అధికారులు
ప్రైవేట్ ఆస్పత్రి–భవన యజమాని వివాదం నేపథ్యంలో చర్యలు
అటాచ్‌మెంట్ ఆదేశాలు జారీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్
-
Jun 26, 2026 10:54 IST
ఫిఫా ప్రపంచ కప్: యూఎస్‌పై టర్కీ విజయం
ఉత్కంఠగా సాగిన మ్యాచ్
చివర్లో గోల్ కొట్టి విజయం సాధించిన టర్కీ
3-2 తేడాతో యూఎస్‌పై టర్కీ విజయం
-
Jun 26, 2026 10:51 IST
మరోసారి చమురు ధరల పతనం
75.07 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర
71.79 డాలర్లకు చేరిన WTI చమురు ధర
హోర్ముజ్‌లో షిప్పింగ్ తిరిగి మొదలవడంతో ధరల పతనం
-
Jun 26, 2026 10:51 IST
హైదరాబాద్: గోల్డ్‌మ్యాన్ సూర్య భాయ్‌పై కేసు
తక్కువ ధరకే విదేశీ బంగారం అంటూ మోసం చేశాడని బాధితుల ఆరోపణ
రూ.లక్షలు వసూలు చేశాడని బాధితుల ఆరోపణ
సూర్య భాయ్‌పై అత్తాపూర్ పీఎస్‌లో కేసు నమోదు
-
Jun 26, 2026 10:50 IST
వెనెజువెలాలో 250కి చేరిన మృతుల సంఖ్య
4,300 మంది గాయపడినట్టు గుర్తింపు
-
Jun 26, 2026 10:49 IST
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
కేతిరెడ్డి నివాసం వద్ద వైసీపీ కార్యకర్తల ఆందోళన
భద్రతకు వచ్చిన పోలీసులతో వాగ్వాదం, తోపులాట
పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కార్యకర్తలు
భగత్‌సింగ్ నగర్‌లోని కేతిరెడ్డి నివాసానికి చేరుకున్న ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి
-
Jun 26, 2026 10:37 IST
ఫిఫా ప్రపంచకప్2026: మరో మ్యాచ్ డ్రా
1-1తో జపాన్-స్వీడన్ మ్యాచ్ డ్రా
-
Jun 26, 2026 09:50 IST
హైదరాబాద్: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి
రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీ కొట్టిన బుల్లెట్ బైక్
స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి
బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు
గచ్చిబౌలి AMB మాల్ ఫ్లై ఓవర్‌పై ఘటన
-
Jun 26, 2026 09:48 IST
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన
గాంధీ విగ్రహం ఎదుట సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై కేతిరెడ్డి నిరసన
అనుచరులతో కలిసి భగత్‌సింగ్ నగర్‌లో బైఠాయింపు
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
-
Jun 26, 2026 09:47 IST
నిజామాబాద్: అర్గుల్ వద్ద జాతీయ రహదారిపై అంబులెన్స్, ట్రాక్టర్ ఢీ
మృతదేహంతో తమిళనాడు నుంచి ఢిల్లీకి వెళ్తున్న అంబులెన్స్‌కు ప్రమాదం
ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులను ఆర్మూర్ ఆస్పత్రికి తరలింపు
-
Jun 26, 2026 09:46 IST
విశాఖ: పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఫొటోగ్రాఫర్ ఇంట్లో చోరీ
మేడపై నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు
తులానికి పైగా బంగారం, 30 తులాల వెండి వస్తువుల అపహరణ
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పెందుర్తి పోలీసులు
-
Jun 26, 2026 09:45 IST
కోనసీమ: ముమ్మిడివరంలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నాయకుడు మోకా లోవరాజు మృతి
గెద్ధనాపల్లి సమీపంలో తలకు గాయాలతో రోడ్డుపై పడి ఉన్న లోవరాజు
ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల అనుమానం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మృతుడు లోవరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు
-
Jun 26, 2026 09:43 IST
కడప: పోరుమామిళ్ల అటవీ రేంజ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణా
అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
30 ఎర్రచందనం దుంగల స్వాధీనం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అటవీ అధికారులు
-
Jun 26, 2026 09:41 IST
కామారెడ్డి జిల్లా వాసి లండన్‌లో అనుమానాస్పద మృతి
రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి మృతి
ఎంఎస్ చదువుతున్న శ్రీనాథ్ రెడ్డి
బర్త్‌డే పార్టీకి వెళ్లిన అనంతరం మృతి చెందినట్లు సమాచారం
-
Jun 26, 2026 09:27 IST
మొహర్రం అంటేనే త్యాగం: సీఎం చంద్రబాబు
ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యమార్గంలో నడవాలనే స్ఫూర్తిని మొహర్రం అందిస్తుంది
సత్యం, న్యాయం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడిన ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకుందాం
మొహర్రం అందరికీ శాంతిని తీసుకురావాలని, ధర్మ మార్గాన్ని చూపాలని కోరుకుంటున్నాను: సీఎం చంద్రబాబు
-
Jun 26, 2026 09:26 IST
కడప: పట్నూతల గ్రామంలో 4 ఏళ్ల రిత్విక హత్య, కేసు నమోదు
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పోలీసులు
ఆందోళన విరమించిన పాప బంధువులు
పక్కింటివారిపైనే కుటుంబ సభ్యుల అనుమానం
అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు
-
Jun 26, 2026 09:24 IST
విశాఖ: శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు భూమి కబ్జాకు యత్నం
మధురవాడలో రూ.2కోట్ల విలువైన స్థలంపై వివాదం
1989లో కొనుగోలు చేసిన 333.33గజాల స్థలంపై ఫేక్ రిజిస్ట్రేషన్లు
ఫోర్జరీ సంతకాలతో పలుమార్లు బదిలీ చేసినట్టు ఆరోపణలు
-
Jun 26, 2026 09:22 IST
హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
మధ్యాహ్నం 12గంటలకు AIG ఆస్పత్రికి ఏపీ ముఖ్యమంత్రి
సాధారణ వైద్య పరీక్షల కోసం ఏఐజీకి సీఎం చంద్రబాబు
రేపు ఉదయం 10 గంటలకు వెలిగొండ ప్రాజెక్ట్‌కు సీఎం
పలు కార్యక్రమాల అనంతరం ఉండవల్లికి తిరుగు ప్రయాణం
-
Jun 26, 2026 08:33 IST
అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ Vs వైసీపీ
గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేస్తామని వైసీపీ ప్రకటన
వైసీపీ సామూహిక దీక్షను అడ్డుకుంటామంటున్న టీడీపీ
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గృహ నిర్బంధం
ప్రధాన కూడళ్లలో మోహరించిన పోలీసులు
వైసీపీ దీక్షకు అనుమతి లేదంటున్న పోలీసులు
-
Jun 26, 2026 08:32 IST
అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం
-
Jun 26, 2026 08:32 IST
ఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా మహేష్ దీక్షిత్ నియామకం
1993 ఏపీ క్యాడర్ IPS అధికారి మహేష్ దీక్షిత్
కశ్మీర్‌లో ఐబీ జేడీగా పనిచేసిన మహేష్ దీక్షిత్
-
Jun 26, 2026 07:35 IST
తిరుమల: నేటి నుంచి 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
-
Jun 26, 2026 07:25 IST
అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్ అరంగేట్రానికి ఆసన్నమైన సమయం
ఇవాళ సా.6 గంటలకు ఐర్లాండ్‌తో T20లో వైభవ్ మ్యాచ్ ఆడే అవకాశం
వైభవ్ తుదిజట్టులో ఉంటే అతి పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డు బ్రేక్
-
Jun 26, 2026 07:24 IST
తెలంగాణలో మరో 7 రోజులు భారీ వర్షాలు
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పలుచోట్ల పిడుగులతో వర్షాలు పడే అవకాశం
-
Jun 26, 2026 07:21 IST
వెనెజువెలా భూకంపంలో పెరిగిన మృతుల సంఖ్య
ఇప్పటివరకు 188 మంది మృతి, 1500 మందికి గాయాలు
కూలిన వేలాది భవనాలు, శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకుని ఉంటారని అనుమానం
కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Jun 26, 2026 07:20 IST
అన్నమయ్య: టానా వడ్డిపల్లిలో రోడ్డుప్రమాదం
కారు-ఆటో ఢీకొని ముగ్గురి మృతి
మరో ఏడుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
పీర్ల పండుగకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఘటన
-
Jun 26, 2026 07:19 IST
జార్ఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం
వ్యాన్-ట్రక్కు ఢీకొని ఏడుగురి మృతి
మరొకరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
రామ్‌గఢ్ జిల్లాలోని లారి-బర్లౌంగ్ సమీపంలో ప్రమాదం
-
Jun 26, 2026 07:18 IST
అనంతపురం: NH-42పై గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
చెట్టును ఢీకొట్టిన లారీ.. చెలరేగిన మంటలు
లారీ డ్రైవర్ ఓబుల్‌రెడ్డి సజీవ దహనం
ప్రాణాలతో బయటపడ్డ క్లీనర్ పుల్లయ్య
మృతుడు కడప జిల్లా కనుమపల్లి వాసిగా గుర్తింపు
-
Jun 26, 2026 07:18 IST
పల్నాడు: మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
నగరవనం వద్ద ఆగివున్న వాహనాన్ని ఢీకొన్న తుఫాను వాహనం
నలుగురి మృతి, పలువురికి గాయాలు
మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు
గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రికి తరలింపు
హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా ప్రమాదం
-
Jun 26, 2026 07:17 IST
వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు 3 రోజుల సెలవులు
నేటి నుంచి మూడు రోజులపాటు మార్కెట్ మూసివేత
సోమవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభం
-
Jun 26, 2026 07:17 IST
సింగపూర్ నౌకపై ఇరాన్ దాడి
నిర్దేశించిన మార్గంలో వెళ్లలేదని సింగపూర్ నౌకపై దాడి
-
Jun 26, 2026 07:09 IST
నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ
బారా షహీద్ దర్గాలో 5 రోజుల పాటు రొట్టెల పండుగ
దేశ నలుమూలల నుంచి తరలిరానున్న భక్తులు
నేడు చందల్‌మౌలి, రేపు గంధం, 28న రొట్టెల పండుగ
ఈనెల 29న తహలీల్ ఫాతేహా, 30న ముగింపు ఉత్సవాలు