Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 24 , 2026 | 06:41 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 24, 2026 07:55 IST

    నేడు మరోసారి SECని కలవనున్న వైసీపీ నేతలు

    • నామినేషన్లలో పోలీసులు అక్రమాలు చేశారని ఆరోపణ

    • మరోసారి వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లే అవకాశం

  • Oct 24, 2026 07:54 IST

    నేటితో ముగియనున్న 4 మున్సిపాలిటీల్లో రీ నామినేషన్

    • కడపలో 11, తిరుపతిలో 18, రాజంపేటలో 11, మైదుకూరులో 32 వార్డులకు రీ నామినేషన్

    • మ.3గంటలకు ముగియనున్న నామినేషన్ల స్వీకరణ

  • Oct 24, 2026 07:54 IST

    నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన

    • నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 వరకు గడువు

    • అదేరోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తుది జాబితా

    • ఎంపీటీసీ స్థానాలకు 40వేలకు పైగా నామినేషన్ల దాఖలు

    • జడ్పీటీసీ స్థానాలకు 3వేలకు పైగా నామినేషన్లు

  • Oct 24, 2026 07:53 IST

    జోర్డాన్‌లో ఉగ్రవాదుల కాల్పులు

    • కరాక్ ప్రావిన్స్‌లోని చర్చిలో ఉగ్రవాదుల కాల్పులు

    • ఏడుగురి మృతి, 34 మందికి గాయాలు

    • ముగ్గురు ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు

  • Oct 24, 2026 07:53 IST

    కెన్యా రాజధాని నైరోబీలో కూలిన 18 అంతస్తుల భవనం

    • నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన భవనం

    • పదుల సంఖ్యలో మృతి.. శిథిలాల కింద కార్మికులు

  • Oct 24, 2026 07:52 IST

    నేడు టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అధ్యక్షతన కీలక భేటీ

    • ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ

    • ప్రస్తుతం హైదరాబాద్‌లోనే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్

  • Oct 24, 2026 07:51 IST

    నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల కీలక సమావేశం

    • తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా నేతల భేటీ

    • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ

  • Oct 24, 2026 07:51 IST

    నేడు కన్నేపల్లి పంప్‌హౌస్‌కు బీఆర్ఎస్ నేతల బృందం

    • కన్నేపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం

  • Oct 24, 2026 07:47 IST

    ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

    • ఇవాళ వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

    • రేపటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం

    • ఈనెల 26న తుఫాన్‌గా మారనున్న తీవ్రవాయుగుండం

    • ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదులుతున్న తుఫాన్

    • ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన

  • Oct 24, 2026 07:29 IST

    కర్ణాటక: బీదర్‌లో రోడ్డు ప్రమాదం

    • కారు, బస్సు ఢీకొని ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు

    • బీదర్‌ జిల్లా బసవ కల్యాణి వద్ద ప్రమాదం

    • మృతులు సంగారెడ్డి జిల్లా మానూర్‌కు చెందిన వారిగా గుర్తింపు

  • Oct 24, 2026 07:03 IST

    నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

  • Oct 24, 2026 07:03 IST

    బిహార్‌: శివాన్‌ జిల్లా అలంపూర్‌లో అగ్నిప్రమాదం

    • బాణసంచా నిల్వ ఉంచిన ఇంట్లో పేలుడు

    • ఐదుగురు మృతి, మరికొందరికి తీవ్రగాయాలు

  • Oct 24, 2026 07:02 IST

    ఇజ్రాయెల్‌ ఎన్నికలలో తీవ్ర ఉద్రిక్తతలు

    • వెస్ట్‌బ్యాంక్‌లోని హెబ్రోన్‌ దగ్గర సైన్యం కాల్పులు

    • కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్ల మృతి, ఐదుగురికి గాయాలు

    • వెస్ట్‌బ్యాంక్‌ను దిగ్బంధించాలని నెతన్యాహు ఆదేశం

    • పూర్తిస్థాయి మూసివేతకు సిద్ధంగా ఉండాలని సూచన

    • హమాస్‌ దాడుల కుట్రను భగ్నం చేశామన్న నెతన్యాహు

  • Oct 24, 2026 07:01 IST

    అమెరికాకు రష్యా డీజిల్‌

    • రష్యా నుంచి అమెరికాకు బయల్దేరిన తొలి డీజిల్‌ ట్యాంకర్‌

    • నవంబర్‌ 7న న్యూయార్క్‌కు చేరుకోనున్న నౌక

    • తొలుత 40 వేల టన్నుల డీజిల్‌ సరఫరా చేయనున్న రష్యా

    • ఇటీవలే రష్యాతో ఒప్పందం చేసుకున్న అమెరికా

  • Oct 24, 2026 06:57 IST

    యూరప్‌లో రికార్డ్‌ స్థాయి ఉష్ణోగ్రతలు

    • వడగాలుల బీభత్సంతో వేలాది మంది మృతి

    • చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాతావరణంలో మార్పులు

    • పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఐరోపా ప్రజల్లో ఆందోళన

  • Oct 24, 2026 06:41 IST

    నేడు భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో T20

    • మధ్యాహ్నం 12:30కు ప్రారంభంకానున్న మ్యాచ్‌

    • ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్‌ ఆధిక్యం