-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International and Breaking Live Updates of 6th May 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 06 , 2026 | 07:08 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 06, 2026 21:08 IST
IPL: పంజాబ్ కింగ్స్ టార్గెట్ 236 పరుగులు
సన్‌రైజర్స్ హైదరాబాద్- 235/4
క్లాసెన్ 69, ఇషాన్ 55, హెడ్ 38, అభిషేక్ 35 పరుగులు
-
May 06, 2026 21:04 IST
తమిళనాడు: TVK ఎమ్మెల్యేలకు అధిష్టానం కీలక ఆదేశాలు
తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ.. రిసార్ట్‌లోనే ఉండాలని TVK అధిష్టానం ఆదేశం
-
May 06, 2026 20:53 IST
నంద్యాల: బనగానపల్లె మండలం బీరువలి గ్రామంలో దారుణం
కుటుంబ కలహాలతో భార్య లక్ష్మి (36)ని గొంతు నులిమి చంపిన భర్త వెంకట స్వామి
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
-
May 06, 2026 20:30 IST
పార్వతీపురం మన్యం జిల్లా: సీతంపేట మండలం సవరపాడు ఘాట్ రోడ్డులో ప్రమాదం
అదుపుతప్పి బోల్తా పడిన బొలెరో వాహనం.. 17 మందికి గాయాలు
గాయపడిన వారిలో నీలమ్మ అనే మహిళ పరిస్థితి విషమం
ప్రమాద సమయంలో వాహనంలో 40 మంది ప్రయాణికులు
పుట్టిగాం గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం
-
May 06, 2026 19:35 IST
పిడుగుపడి గొర్రెల కాపరి మృతి
నెల్లూరు: పెళ్లకూరు మండలం శిరసనంబేడులో విషాద ఘటన
పిడుగుపడి గొర్రెల కాపరి సిద్దార్థ్(48) మృతి
-
May 06, 2026 19:34 IST
గోడను ఢీకొన్న బైక్.. యువకుడి మృతి
విశాఖ: కొత్తపాలెం-నరవ మార్గంలో ప్రమాదం
అదుపుతప్పి గోడను ఢీకొన్న బైక్.. క్రాంతి(22) అనే యువకుడి మృతి
-
May 06, 2026 19:21 IST
మొక్కజొన్న పంట దగ్ధం
ఖమ్మం: ముదిగొండ మండలం ముత్తారంలో దగ్ధమైన మొక్కజొన్న
ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 5 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధం
-
May 06, 2026 19:19 IST
ఖమ్మం: గువ్వలగూడెంలో ప్రజాదర్బార్.. పాల్గొన్న మంత్రి పొంగులేటి
అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్నాం: పొంగులేటి
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అడుగులు: పొంగులేటి
-
May 06, 2026 19:18 IST
తమిళనాడు: AIADMK నేత మునుస్వామి కీలక వ్యాఖ్యలు
TVKకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు: మునుస్వామి
మద్దతు అంశంపై పార్టీలో విభేదాలు లేవు: మునుస్వామి
-
May 06, 2026 19:00 IST
విజయనగరంలో టీడీపీలోకి వలసలు
విజయనగరం: 27 వ డివిజన్‌కు చెందిన 60 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక
టీడీపీ కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు
-
May 06, 2026 18:32 IST
తమిళనాడు: పళనిస్వామి నివాసంలో AIADMK ఎమ్మెల్యేల సమావేశం
TVKకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చ
-
May 06, 2026 18:32 IST
తిరుమల SV ప్రాణదానం ట్రస్టుకు రూ.2.50 కోట్ల విరాళం
టీటీడీ చైర్మన్‌కు విరాళం డీడీ అందజేసిన కోల్‌కతాకు చెందిన హిమాద్రి ట్రస్ట్
-
May 06, 2026 18:31 IST
సంక్షోభంలో ఉన్న ఎయిర్‌లైన్స్‌కు కేంద్రం బెయిలవుట్
రూ.5 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
-
May 06, 2026 17:45 IST
చెన్నై: MLAల మద్దతు కూడగట్టే పనిలో TVK పార్టీ
TVKకి మద్దతు ఇవ్వబోమని తేల్చిన వామపక్షాలు
DMK కూటమిలోనే కొనసాగుతామన్న లెఫ్ట్ పార్టీలు
గవర్నర్ దగ్గర బలం నిరూపించలేకపోయిన విజయ్
గవర్నర్‌ను 2 వారాల సమయం కోరిన విజయ్
-
May 06, 2026 17:45 IST
వలసలపై ట్రంప్ ఆంక్షలు.. అమెరికన్లపై వ్యక్తిగత ప్రభావం
ట్రంప్ చర్యలతో సగటు అమెరికన్‌పై వ్యక్తిగత స్థాయిలో ప్రభావం
వలసలపై ఆంక్షలతో తమకు తెలిసిన వారు ప్రభావితమయ్యారంటూ ఆవేదన
విదేశీయులకు అమెరికా అనుకూలం కాదన్న 60 శాతం మంది అమెరికన్లు
-
May 06, 2026 17:20 IST
ధాన్యం కొనుగోళ్లపై BRS గోబెల్స్ ప్రచారం: మంత్రి ఉత్తమ్
రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు: మంత్రి ఉత్తమ్
మేం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం: ఉత్తమ్
95 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్ల లక్ష్యం: మంత్రి ఉత్తమ్
-
May 06, 2026 17:02 IST
చెన్నై: ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌కు లభించని గవర్నర్ అనుమతి
మెజార్టీపై గవర్నర్‌ను ఒప్పించలేకపోయిన విజయ్
విజయ్‌కు 112 మంది ఎమ్మెల్యేల బలం
118 మంది ఎమ్మెల్యేల బలం అవసరమన్న గవర్నర్
-
May 06, 2026 16:41 IST
హైదరాబాద్‌లో మరోసారి రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు
200 మందికి పైగా రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు
మొత్తం మూడు ఆస్పత్రుల్లో డ్రగ్స్ పరీక్షలు
గత నెలలో చేసిన డ్రగ్స్ పరీక్షల్లో 187 మందికి పాజిటివ్
-
May 06, 2026 16:38 IST
తెలంగాణ భద్రతా సలహాదారుగా రిటైర్డ్ డీజీపీ శివధర్‌రెడ్డి బాధ్యతలు
ముడేళ్ల పాటు SSA పదవిలో కొనసాగనున్న మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి
-
May 06, 2026 16:37 IST
ఢిల్లీ: కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్ భేటీ
హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2కి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి
మెట్రో ఫేజ్ -2పై కేంద్రానికి ఇప్పటికే DPR పంపిన తెలంగాణ సర్కార్
-
May 06, 2026 16:37 IST
హైదరాబాద్: DGP సీవీ ఆనంద్‌కు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం
కాన్వాయ్ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించొద్దు: సీఎం రేవంత్ రెడ్డి
-
May 06, 2026 16:35 IST
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
941 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
298 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
May 06, 2026 15:52 IST
ఏపీలో భారీ పెట్టుబడులకు SIPB ఆమోదం
రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగావకాశాలు
విశాఖలో రూ.లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్
శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్
కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు
తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ తయారీ పరిశ్రమ
-
May 06, 2026 15:50 IST
తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
17 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామకం
-
May 06, 2026 15:23 IST
చెన్నై: లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్
ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరిన విజయ్
113 మంది MLAల జాబితా గవర్నర్‌కు అందజేత
108 TVK, ఐదుగురు కాంగ్రెస్ MLAలతో జాబితా
-
May 06, 2026 15:08 IST
IPL ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదికల ఖరారు
ధర్మశాలలో క్వాలిఫయర్-1 మ్యాచ్
చండీగఢ్‌లో క్వాలిఫయర్-2, ఎలిమినేటర్ మ్యాచ్‌లు
అహ్మదాబాద్‌లో IPL ఫైనల్ మ్యాచ్
-
May 06, 2026 14:54 IST
రాహుల్, సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క
కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సీతక్క
కేటీఆర్ వ్యాఖ్యలు వారి అహంకారానికి నిదర్శనం..
రైతులను BRS పూర్తిగా నిర్లక్ష్యం చేసింది..
BRS హయాంలోనే పూర్తి రుణమాఫీ జరగలేదు: మంత్రి సీతక్క
-
May 06, 2026 14:53 IST
తమిళనాడు: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్
ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న విజయ్
రేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
-
May 06, 2026 14:49 IST
తమిళనాడు: లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన EC అధికారులు
గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాలను గవర్నర్‌కు అందజేత
-
May 06, 2026 14:44 IST
హైదరాబాద్: కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ సవాల్
రైతుల సంక్షేమంపై చర్చకు కేటీఆర్ సిద్ధమా?: అద్దంకి
సీఎం రేవంత్ వస్తేనే వస్తా అని తప్పించుకోవద్దు: అద్దంకి
పదేళ్లు జల్సాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతారా?: అద్దంకి దయాకర్
-
May 06, 2026 14:43 IST
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
850 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
250 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
-
May 06, 2026 14:17 IST
నిజామాబాద్: బోధన్ పోలీస్ స్టేషన్‌లో ACB దాడులు
లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ భాస్కరాచారి
7వేల నగదు స్వాధీనం.. ACB అదుపులో ఎస్ఐ భాస్కరాచారి
-
May 06, 2026 14:14 IST
ఆటో బోల్తా.. ఏడుగురికి తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం : గుండాల మండలంలో రోడ్డు ప్రమాదం
చెట్టుపల్లి నుంచి ఇల్లందు వస్తున్న ఆటో
బ్రేక్ ఫెయిల్ అవడంతో బోల్తా కొట్టిన ఆటో
ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
-
May 06, 2026 13:45 IST
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు హైకోర్టులో ఊరట
కూకట్‌పల్లి పీఎస్‌లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు
మన్నె క్రిశాంక్‌తో పాటు మరో ఏడుగురికి బెయిల్
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రాజేష్ ఫిర్యాదుతో కేసు
-
May 06, 2026 13:44 IST
కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ కసరత్తు
కేరళ పరిశీలకులుగా అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్
కేరళ వెళ్లనున్న కాంగ్రెస్ పరిశీలకులు
కేరళ సీఎంను ఎంపిక చేయనున్న పరిశీలకులు
సీఎం రేసులో రమేష్ చెన్నితల, వీడీ సతీషన్, కేసీ వేణుగోపాల్
-
May 06, 2026 13:43 IST
తిరుమల: ముగిసిన TTD పాలకమండలి సమావేశం
తిరుమలలో TTD పరిపాలనా భవనం నిర్మాణానికి ఆమోదం
ఉద్యోగుల వైద్య ఖర్చులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి కమిటీ నియామకం
అలిపిరి దగ్గర టౌన్‌షిప్ నిర్మాణానికి త్వరలో భూమి పూజ
TTD కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐడీ కార్డుతో శ్రీవారి దర్శనానికి అనుమతి
-
May 06, 2026 12:28 IST
సోనియా నివాసంలో అగ్రనేతల సమావేశం
కేరళ సీఎం ఎంపికపై అధిష్ఠానం చర్చలు
-
May 06, 2026 12:05 IST
టీవీకేకి కాంగ్రెస్ మద్దతిస్తే డీఎంకేకి వెన్నుపోటు పొడిచినట్లే: కనిమొళి ఎన్వీఎన్ సోము
-
May 06, 2026 11:57 IST
సీఎం పదవికి రాజీనామా చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
-
May 06, 2026 11:50 IST
వరంగల్: భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్
అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి కేటీఆర్
అమ్మవారి దర్శనం అనంతరం హంటర్ రోడ్డులోని రైతు సభకు హాజరుకానున్న కేటీఆర్
-
May 06, 2026 11:49 IST
స్వస్త్ భారత్ పోర్టల్‌ను ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం
-
May 06, 2026 11:34 IST
చెన్నై: ఏఐఏడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలిసిన టీవీకే నేత ఎన్ ఆనంద్
-
May 06, 2026 11:31 IST
కోల్‌కతా: లోక్ భవన్‌కు బెంగాల్ సీఈవో మనోజ్
-
May 06, 2026 11:29 IST
మమతా బెనర్జీ ఆరోపణలపై స్పందించిన ఎన్సీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా
-
May 06, 2026 11:27 IST
తెలంగాణ సర్కార్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
అన్నదాతల బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా: కేంద్ర మంత్రి
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల నష్టపోతున్నారు: కేంద్ర మంత్రి
-
May 06, 2026 11:21 IST
మహబూబ్‌నగర్: దేవరకద్ర మండలం గోప్లా దగ్గర రోడ్డు ప్రమాదం
డీసీఎంను వెనుక నుంచి ఢీకొన్న లారీ, లారీ డ్రైవర్ మృతి
-
May 06, 2026 11:19 IST
తిరుపతి: జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన
సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రి నారా లోకేశ్
ఘనస్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
ప్రతిఒక్కరినీ పలకరించి ఫొటోలు దిగిన మంత్రి లోకేశ్
శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్
-
May 06, 2026 11:16 IST
నెల్లూరు: కోవూరు ఇఫ్కో సెజ్‌లో మహానాడు పనులకు శంకుస్థాపన
హాజరైన ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం, నారాయణ, ఎమ్మెల్యేలు
ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడు నిర్వహణ
-
May 06, 2026 10:48 IST
చెన్నై: టీవీకేతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మాణిక్కం ఠాకూర్
-
May 06, 2026 10:33 IST
ఐపీఎల్2026: నేడు మరో కీలక పోరు
ఉప్పల్ వేదికగా హైదరాబాద్ vs పంజాబ్ మ్యాచ్
రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
-
May 06, 2026 10:32 IST
హైదరాబాద్: అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ ఆపరేషన్
కమిషనర్‌గా ఛార్జ్ తీసుకున్న తొలి రోజే ఫీల్డ్‌లోకి వెళ్లిన సుమతి
సెక్యూరిటీ లేకుండా అర్ధరాత్రి దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ దగ్గరకు వెళ్లిన సీపీ సుమతి
సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులు ఎదుర్కొన్న సుమతి
సీపీ సుమతిని చుట్టుముట్టిన 40 మంది పోకిరీలు
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సీపీ సుమతి ఆపరేషన్
-
May 06, 2026 10:06 IST
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్
-
May 06, 2026 10:05 IST
చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం రద్దు
టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు
40 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం
మొత్తం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 47
సమావేశాన్ని రద్దు చేసిన పార్టీ అధినేత పళనిస్వామి
-
May 06, 2026 09:37 IST
చెన్నై: విజయ్‌తో భేటీ కానున్న కాంగ్రెస్ పార్టీ బృందం
ఇప్పటికే TVK ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు
మద్దతు అంశంలో షరతు విధించిన కాంగ్రెస్ పార్టీ
బీజేపీతో సంబంధం ఉన్న పార్టీలను ప్రభుత్వంలోకి ఆహ్వానించకూడదని స్పష్టం చేసిన కాంగ్రెస్
-
May 06, 2026 09:36 IST
హైదరాబాద్: మల్కాజ్‌గిరిలోని ఓ రెస్టారెంట్‌లో రౌడీ షీటర్ల హంగామా
బిల్లు కట్టమన్నందుకు యాజమాన్యం, సిబ్బందిపై దాడి
రౌడీషీటర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రెస్టారెంట్ సిబ్బంది
పోలీసులకు ఫిర్యాదు చేసిన రెస్టారెంట్ యాజమాన్యం
-
May 06, 2026 09:30 IST
చార్మినార్ దగ్గర బెంగాల్ నటికి వేధింపులు, నిందితుడి అరెస్ట్
కుటుంబంతో కలిసి చార్మినార్ సందర్శనకు వచ్చిన బెంగాల్ నటి ప్రత్యూష
నటి ప్రత్యూషను వేధించిన టోలీచౌకీకి చెందిన వాజిద్
పోలీసులకు నటి ఫిర్యాదు, కేసు నమోదు
నిందితుడు వాజిద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
May 06, 2026 09:28 IST
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 420 పాయింట్లు
నిఫ్టీ 140 పాయింట్లకు పైగా లాభం
-
May 06, 2026 09:09 IST
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం
మ.2:30 గంటలకు సెర్ప్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
-
May 06, 2026 08:24 IST
మేడ్చల్ జిల్లా: కీసరలో గొర్రెలపై వీధి కుక్కల దాడి
15 గొర్రెల మృతి, మరికొన్ని గొర్రెలకు గాయాలు
సుమారు లక్షాయాభై వేల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుల ఆవేదన
వీధి కుక్కల సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుల ఆవేదన
ప్రభుత్వం తమకు సహాయం చేయాలని బాధితుల విజ్ఞప్తి
-
May 06, 2026 08:11 IST
ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి
బెంగళూరుకు సన్నగిల్లుతున్న అవకాశాలు
రాజకీయ వివాదాల ప్రభావమే కారణమని బీసీసీఐ సంకేతాలు
-
May 06, 2026 08:00 IST
పంజాబ్: అమృత్‌సర్, జలంధర్‌లో పేలుళ్ల కలకలం
అమృత్‌సర్ కంటోన్మెంట్ ఏరియాలో పేలుడు
పేలుడుకు IED వినియోగించినట్లు గుర్తింపు
-
May 06, 2026 08:00 IST
కాకినాడ: నేడు కొనసాగనున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు విచారణ
నిన్న విచారణకు ఏమాత్రం సహకరించని అనంతబాబు
డ్రైవర్ హత్య కేసులో సాక్షులను ఎందుకు బెదిరించారని పోలీసులు ప్రశ్నిస్తే తనకు తెలియదంటూ బుకాయించిన అనంతబాబు
ఈ రోజు మధ్యాహ్నం పోలీసులు అనంతబాబును కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు
-
May 06, 2026 07:11 IST
నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఉ.10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనం
కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలవనున్న సీఎం రేవంత్
మెట్రో రెండో దశకు అనుమతులు కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్న సీఎం
కేరళ రాజకీయాలపై అధిష్ఠానంతో సీఎం రేవంత్ చర్చించే అవకాశం
-
May 06, 2026 07:08 IST
నేడు తిరుపతి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన
గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న లోకేశ్