Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 21 , 2026 | 07:31 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 21, 2026 21:47 IST

    లండన్‌: ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం

    • తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ ఆహ్వానం

    • తెలంగాణ రైజింగ్ విజన్‌ను ఆక్స్‌ఫర్డ్ విద్యావేత్తలకు వివరించిన రేవంత్

    • హైదరాబాద్‌లో ఆక్స్‌ఫర్డ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానం

    • తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలపై చర్చ

  • Aug 21, 2026 21:28 IST

    కాకినాడ: ఢిల్లీలో పోలీసులకు చిక్కిన సాదిక్‌ ఖాన్‌

    • ఇంజినీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ఖాన్‌

    • నిందితుడు సాదిక్‌ఖాన్‌పై కాకినాడ, రాజమండ్రి పీఎస్‌లలో కేసు నమోదు

  • Aug 21, 2026 21:25 IST

    విజయనగరం: జామి మం. జాగారం వద్ద బైక్‌ ఢీకొని ఇద్దరి మృతి

    • మృతులు జామి గ్రామానికి చెందిన గొర్లి పవన్, జాగరం గ్రామానికి చెందిన రావాడ వెంకటరావుగా గుర్తింపు

  • Aug 21, 2026 21:02 IST

    నంద్యాల: ఆత్మకూరులో కానిస్టేబుల్‌ను హత్యచేసిన నిందితుడు, మాజీ నక్సలైట్‌ సుబ్బన్న అరెస్ట్‌

    • 1992 నాటి ఘటన తర్వాత పరారీలో సుబ్బన్న

    • కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్నాడన్న సమాచారంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

  • Aug 21, 2026 20:53 IST

    కృష్ణా: ఉయ్యూరులో డయేరియా కేసుల అంశం

    • డయేరియా కలకలంపై మంత్రి సత్యకుమార్ ఆరా

    • 5 కేసులు నమోదైనట్లు మంత్రికి వివరించిన అధికారులు

  • Aug 21, 2026 20:10 IST

    విజయనగరం: బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని బెర్రి కంపెనీలో గ్యాస్ లీక్‌

    • యూపీకి చెందిన సరోజ్‌పాల్‌ అనే కార్మికుడికి తీవ్ర గాయాలు

  • Aug 21, 2026 19:45 IST

    రేపు కేరళకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

    • వైద్యుల సూచనతో భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ

  • Aug 21, 2026 19:45 IST

    నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు.. ఇద్దరి అరెస్ట్‌

    • ఒడిశా నుంచి శిర్డీకి రైలులో అక్రమంగా తరలిస్తున్న 24 కిలోల గంజాయి స్వాధీనం

  • Aug 21, 2026 19:28 IST

    తిరుపతి: రేణిగుంట గంగమ్మ జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 13 మందిపై కేసులు నమోదు

    • పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ఇరువర్గాలు

    • నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

    • వేణుగోపాలపురం, జ్యోతినగర్‌కు చెందిన యువకుల మధ్య చెలరేగిన వివాదం

    • పండుగలు, బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవన్న రేణిగుంట సీఐ జయచంద్ర

  • Aug 21, 2026 19:19 IST

    ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: మంత్రి సీతక్క

    • గత ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తప్పించింది: మంత్రి సీతక్క

  • Aug 21, 2026 19:07 IST

    బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సాత్విక్-చిరాగ్ ఔట్

    • క్వార్టర్ ఫైనల్‌లో చైనా జంటపై సాత్విక్-చిరాగ్ ఓటమి

  • Aug 21, 2026 18:59 IST

    సికింద్రాబాద్‌: కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లో అస్వస్థతతో చిన్నారి మృతి

  • Aug 21, 2026 18:53 IST

    బ్రిటన్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

    • ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో సీఎం రేవంత్‌ పర్యటన

    • బ్లావాట్‌నిక్‌ స్కూల్ ఆఫ్‌ గవర్నమెంట్‌లో సీఎం బృందం టూర్‌

  • Aug 21, 2026 18:39 IST

    రేపు విశాఖ, విజయనగరంలో మంత్రి లోకేశ్ పర్యటన

    • విశాఖ జిల్లా మధురవాడలోని చంద్రంపాలెంలో అభివృద్ధి చేసిన ZP హైస్కూల్‌ ప్రారంభం

    • విజయనగరం జిల్లా దాసన్నపేటలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల క్టస్టర్‌ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేశ్

  • Aug 21, 2026 18:31 IST

    పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో బైఠాయించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు

    • విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఫైరింగ్ ప్రయోగించిన వారిపై కేసు పెట్టాలని డిమాండ్

    • పెల్లెట్ గన్స్ కారణంగా గాయాలైన విద్యార్థి సాహిల్ లోచావ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ

    • పెల్లెట్ గన్స్ ఫైరింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన ఢిల్లీ పోలీసులు

    • రాహుల్ గాంధీ ధర్నాతో దిగివచ్చిన ఢిల్లీ పోలీసులు

  • Aug 21, 2026 18:29 IST

    దేశంలో చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు

    • పండుగల వేళ 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి అనుమతి

    • చక్కెర వ్యాపారులకు 400 టన్నుల స్టాక్ లిమిట్‌ విధింపు

  • Aug 21, 2026 18:28 IST

    హైదరాబాద్: బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలు

    • అక్రమంగా ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

    • టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గోషామహల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్

    • నలుగురు నిందితుల అరెస్ట్.. ఇంజెక్షన్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం

  • Aug 21, 2026 18:13 IST

    టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు

    • కెప్టెన్ గిల్, టీమ్ మేనేజ్‌మెంట్‌కు కుల్‌దీప్ యాదవ్‌పై నమ్మకం లేదు: అశ్విన్

    • అందుకే అతడికి శ్రీలంకతో తొలి టెస్టులో అవకాశం ఇవ్వలేదు: అశ్విన్

  • Aug 21, 2026 18:11 IST

    ఆల్ప్రాజోలం అక్రమ రవాణా నెట్‌వర్క్‌ గుట్టురట్టు చేసిన ఈగల్ ఫోర్స్

    • డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా సంపాదించిన రూ.6 కోట్ల ఆస్తుల జప్తు

    • తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించిన అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్

    • బోధన్‌లో 15 మంది నిందితుల అరెస్ట్

    • 32.5 కిలోల ఆల్ప్రాజోలం స్వాధీనం

  • Aug 21, 2026 17:47 IST

    హైదరాబాద్: రాయదుర్గం భూములకు రికార్డ్‌ ధర

    • వేలంలో ఎకరం రూ.264 కోట్లు పలికిన ధర

    • రాయదుర్గంలోని సర్వే నంబర్‌ 83/1లోని భూములకు వేలం

    • పాన్‌మక్తాలోని 5.25 ఎకరాలకు TGIIC వేలం

    • మే నెలలో జరిగిన వేలంలో రూ.237 కోట్లు పలికిన ఎకరం

  • Aug 21, 2026 17:39 IST

    వైఎస్‌ వివేకా హత్య కేసులో ఈడీ అధికారిక ప్రకటన

    • హైదరాబాద్‌, కడపలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు: ED

    • CBI నమోదు చేసిన FIR, చార్జ్‌షీట్లు ఆధారంగా ECIR నమోదు: ED

    • IPC(120B), 302 సెక్షన్‌ PMLA కింద కేసు నమోదు: ED

    • సోదాల్లో నేరానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరికరాలు సీజ్‌: ED

    • MP అవినాష్‌రెడ్డి నివాసంలో లెక్కచూపని రూ.24 లక్షలు సీజ్‌: ED

  • Aug 21, 2026 17:23 IST

    రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

    • ఉ.10:00కు అనకాపల్లి జిల్లా కొత్తపాడు మం. ఆలమండ కోడూరుకు సీఎం

    • ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులతో సీఎం చంద్రబాబు భేటీ

    • మధ్యాహ్నం విజయనగరం జిల్లా ఎల్‌.కోటలో సీఎం చంద్రబాబు పర్యటన

    • సాయంత్రం విశాఖలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం భేటీ

  • Aug 21, 2026 17:11 IST

    మహారాష్ట్ర శంభాజీనగర్‌లో విషాదం

    • కొండ పైనుంచి పడి ఓ కుటుంబం మృతి

    • తండ్రి తిట్టాడని కొండపై నుంచి దూకిన కుమారుడు

    • కొడుకును కాపాడేందుకు వెళ్లి లోయలోపడిన తండ్రి

    • భర్త, కొడుకు లోయలో పడిపోవడంతో మనస్తాపంతో కొండపై నుంచి దూకిన తల్లి

    • కావడియా కొండ దగ్గర ఘటన

  • Aug 21, 2026 17:07 IST

    సీఎం రేవంత్‌ ఫారిన్‌ టూర్‌పై MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ

    • సీఎం రేవంత్‌ బ్రిటన్‌ పర్యటనకు క్లియరెన్స్: రణధీర్ జైస్వాల్

    • సీఎంలు, ఇతర ప్రముఖుల పర్యటనలను రాజకీయ క్లియరెన్స్ కోసం అంచనా వేస్తాం: రణధీర్ జైస్వాల్

    • ప్రతిపాదిత కార్యక్రమం పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలి: రణధీర్ జైస్వాల్

    • అమెరికా టూర్ అంశంలో అలా లేదు కాబట్టి క్లియరెన్స్ నిరాకరణ: రణధీర్ జైస్వాల్

  • Aug 21, 2026 16:46 IST

    ఉయ్యూరు డయేరియా బాధితులకు మంత్రి నారాయణ పరామర్శ

    • డయేరియాపై దుష్ప్రచారం వద్దు: మంత్రి నారాయణ

    • ఒక వ్యక్తి ఈ నెల 17న గుండెపోటుతో ఆస్పత్రి చేరి మృతి: మంత్రి నారాయణ

    • డయేరియాతో వ్యక్తి మృతికి సంబంధం లేదు: మంత్రి నారాయణ

    • ఉయ్యూరు మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేసే వాటర్‌ లైన్‌కు ఇతర గ్రామాల్లోని నీటి సరఫరా లైన్లకు సంబంధం లేదు: మంత్రి

    • డయేరియాకు కారణాలపై విచారణలో తేలాల్సి ఉంది: మంత్రి నారాయణ

  • Aug 21, 2026 16:36 IST

    స్టార్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్‌పై భారత స్పిన్ బౌలింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు

    • రెండో టెస్టులో కుల్‌దీప్ పుంజుకుంటాడు: కోచ్ బహుతులే

    • ఒక్క మ్యాచ్ ఆధారంగా అతడి సామర్థ్యాన్ని అంచనా వేయొద్దు: బహుతులే

    • అతడు ఎప్పటికీ మ్యాచ్ విన్నరే: బహుతులే

  • Aug 21, 2026 16:30 IST

    అమరావతి: స్థానిక ఎన్నికల విధివిధానాల రూపకల్పనకు 14 మంది సభ్యులతో జనసేన కమిటీ నియామకం

    • క్షేత్ర స్థాయిలో శ్రేణుల ఆలోచనలను పరిగణలోకి తీసుకోనున్న కమిటీ

    • కమిటీ సభ్యులుగా మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ బాలశౌరి తదితరులు

  • Aug 21, 2026 16:19 IST

    అమరావతి: మాజీ సీఎం జగన్‌పై ఎంపీ చింతకాయల విజయ్ సెటైర్లు

    • పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి తేడా తెలియని జగన్ గురించి ప్రజలు ఆలోచించాలి: ఎంపీ విజయ్‌

    • పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్‌లో సర్వీస్ అనే పదాన్ని హోటల్ సర్వీస్ అనుకుని మూల్యాంకనం రిసార్ట్‌లో పెట్టారు: ఎంపీ విజయ్‌

  • Aug 21, 2026 16:12 IST

    ఏపీ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ASSOCHAM అవార్డు

    • ముంబైలో APMDCకి 'బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్' అవార్డు

    • కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా రూ.9వేల కోట్లు APMDC సమీకరణ

    • సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్‌ (NCDs) జారీ ద్వారా భారీగా నిధులు

    • రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా రూ.9వేల కోట్ల నిధుల సమీకరణ

    • APMDC ఆర్థిక నిర్వహణకు ASSOCHAM గుర్తింపు

  • Aug 21, 2026 16:10 IST

    టీమిండియా బ్యాటింగ్‌పై రస్సెల్ ఆర్నాల్డ్ సంచలన వ్యాఖ్యలు

    • ఇది అత్యుత్తమ ప్రదర్శన కాదు: శ్రీలంక మాజీ క్రికెటర్ ఆర్నాల్డ్

    • తొలి టెస్టులో అత్యుత్తమ స్థాయిలో భారత ప్లేయర్లు ఆడలేదు: ఆర్నాల్డ్

    • గెలిచారు కాబట్టి లోటుపాట్ల గురించి ఎవరూ మాట్లాడరు: ఆర్నాల్డ్

  • Aug 21, 2026 15:55 IST

    నల్లగొండ: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు

    • ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

    • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

  • Aug 21, 2026 15:46 IST

    హైదరాబాద్: రాయదుర్గ్ భూముల వేలానికి తొలగిన అడ్డంకులు

    • రాయదుర్గ్‌లో TGIIC నిర్వహిస్తున్న వేలం ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

    • వేలం ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

    • పిటిషనర్ జువ్వాడి ప్రణయ్ సింహారావు దాఖలు చేసిన WP No.1028/2026పై తీర్పు

    • సుప్రీంకోర్టు తీర్పుతో రాయదుర్గ్ భూముల వేలానికి మార్గం సుగమం

  • Aug 21, 2026 15:30 IST

    రాజమండ్రి: డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

    • నిందితులు సురవరపు దస్వంత్ , ఆండ్రూ అడ్వర్డ్స్ జోసఫ్ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించిన న్యాయస్థానం

    • వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్న రిమాండ్

    • రెండు రోజుల కస్టడీ పూర్తికావడంతో నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలులో అప్పగించిన పోలీసులు

  • Aug 21, 2026 15:21 IST

    కడప: పులివెందులలో వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల నివాసాల్లో ముగిసిన ఈడీ సోదాలు

    • ఎంపీ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి నివా‌సాల్లో 7 గంటల పాటు సాగిన సోదాలు

    • వైఎస్ వివేకా హత్యకేసులో కీలక సాక్షి దస్తగిరి నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు

  • Aug 21, 2026 15:15 IST

    తిరుపతి: చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఏర్పేడు పోలీసులు

    • వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని నిందితుల స్నాచింగ్‌లు

    • నిందితులు విజయ్‌రాజ్‌, డేవిడ్‌కుమార్‌‌గా గుర్తింపు

    • 67 గ్రాముల బంగారు ఆభరణాలు సహా బైక్ స్వాధీనం

  • Aug 21, 2026 15:08 IST

    కడప: కలసపాడు మం. ముదిరెడ్డిపల్లెలో శ్రీనివాసులు అనే వ్యక్తి దారుణ హత్య

    • కత్తులతో నరికి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

    • కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు

  • Aug 21, 2026 14:59 IST

    కృష్ణా: ఉయ్యూరులో డయేరియా కలకలం, ఒకరి మృతి

    • వాంతులు, విరేచనాలతో 15 మందికి పైగా ఆస్పత్రిలో చేరిక

    • మరికొందరికి విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స

    • 10 మంది డయేరియా బాధితుల పరిస్థితి విషమం

    • మృతుడు షేక్ నూరుద్దీన్‌గా గుర్తింపు

  • Aug 21, 2026 14:57 IST

    నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న కెప్టెన్ గిల్

    • లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు గిల్ తర్ఫీదు

    • శుక్రవారం అధిక సమయం నెట్స్‌లోనే గడిపిన గిల్

    • తొలి టెస్టులో రెండుసార్లు లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యకే వికెట్ సమర్పించుకున్న గిల్

  • Aug 21, 2026 14:54 IST

    ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత

    • చెన్నైలో చికిత్స పొందుతూ షావుకారు జానకి మృతి

    • 400కి పైగా సినిమాల్లో నటించిన షావుకారు జానకి

    • 1931 డిసెంబర్‌ 12న రాజమండ్రిలో షావుకారు జానకి జననం

    • షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి

    • 2021లో పద్మశ్రీ అవార్డు అందుకున్న షావుకారు జానకి

    పూర్తి కథనం

  • Aug 21, 2026 14:34 IST

    కడప: రాజంపేటలో సుద్దగుంతల దగ్గర పెంచలయ్య అనే వ్యక్తి హత్య

    • హతుని కుమారుడి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

    • కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Aug 21, 2026 14:34 IST

    వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

    • రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును టేకప్ చేసిన ఈడీ

    • వివేకా హత్య వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్న సునీత

    • నేరానికి ఉపయోగించిన ఆయుధం, మనీ ట్రయల్‌పై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టలేదని లేఖలో పేర్కొన్న సునీత

    • భారీగా డబ్బులు చేతులు మారినట్టు అభియోగాలతో ఈడీ దర్యాప్తు

  • Aug 21, 2026 14:22 IST

    పెల్లెట్‌ గన్‌ ఘటనపై రాహుల్‌ గాంధీ ఆరోపణ

    • పెల్లెట్‌ గన్‌ వినియోగంపై కాంగ్రెస్‌ ఆగ్రహం

    • విద్యార్థుల నిరసనలో పెల్లెట్‌ గన్స్‌ వాడారన్న కాంగ్రెస్‌

    • జులై 20 ఘటనపై రాహుల్‌ తీవ్ర విమర్శలు

    • ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదంటూ రాహుల్‌ ఆరోపణ

    • పెల్లెట్‌ గన్‌ ఘటనపై కాంగ్రెస్‌ ప్రశ్నలు

  • Aug 21, 2026 14:20 IST

    బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సెమీస్‌కు చేరిన గాయత్రి - ట్రీసా జోడీ

    • 15 ఏళ్ల తర్వాత భారత్‌కు మహిళల డబుల్స్‌ పతకం

    • నాలుగో సీడ్ చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రి-ట్రీసా

    • సెమీస్‌కు చేరిన గాయత్రి-ట్రీసా జోడీ

    • 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన గాయత్రి-ట్రీసా

  • Aug 21, 2026 13:47 IST

    ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పోలాండ్ మద్దతు

    • భారత్‌తో రక్షణ, ఆర్థిక బంధం బలోపేతానికి పిలుపు

    • భారత్‌కు అండగా ఉంటామన్న పోలాండ్‌

  • Aug 21, 2026 13:45 IST

    యూఎస్‌ ఓపెన్‌కు ముందు రిబాకినా‌కు షాక్

    • సిన్సినాటి క్వార్టర్స్‌లో రిబాకినాకు గాయం

    • ఎడమ కాలి చీలమండకు గాయంతో రిబాకినా సతమతం

  • Aug 21, 2026 13:41 IST

    ఢిల్లీలో ఒక్కరోజే 114 హెచ్‌1ఎన్‌1 కేసుల నమోదు

    • 1,777కు చేరిన హెచ్‌1ఎన్‌1 కేసులు

    • ఢిల్లీలో హెచ్‌1ఎన్‌1 కేసులపై కేంద్రం అప్రమత్తం

    • ఆరోగ్యశాఖ అధికారులతో కేంద్రమంత్రి జేపీ నడ్డా సమీక్ష

  • Aug 21, 2026 12:56 IST

    ఢిల్లీ: పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌కు రాహుల్‌గాంధీ

    • విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించడంపై ఫిర్యాదు

    • జులై 20న CJP ఆందోళనలో పెల్లెట్ వినియోగించారని ఆరోపణ

  • Aug 21, 2026 12:50 IST

    ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఆరు గంటలుగా కొనసాగుతున్న ఈడి సోదాలు

    • వివేకా హత్యకు కోట్ల రూపాయలు చేతులు మారాయని సీబీఐ అభియోగం

    • సీబీఐ ఛార్జ్‌షీట్‌లోని అంశాలతో కేసు నమోదు చేసిన ఈడీ

    • ఇప్పటికే అవినాష్ రెడ్డి నివాసంలో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ

    • ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ఆధారాలు సేకరిస్తున్న ఈడీ

  • Aug 21, 2026 12:49 IST

    హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్

    • ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: నాయిని

    • ఒక్క ఎమ్మెల్యేతోనైనా సరిగా ఉన్నారా: నాయిని రాజేందర్‌రెడ్డి

    • కష్టకాలంలో పార్టీని వదిలి పోయారు: నాయిని రాజేందర్‌రెడ్డి

    • కులాన్ని అడ్డుపెట్టుకుని ఏమైనా చేస్తామంటే కుదరదు: నాయిని

    • బహిష్కరించక ముందే పార్టీ నుంచి వెళ్లిపోండి: నాయిని

  • Aug 21, 2026 12:48 IST

    హైదరాబాద్: సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవద్దు: ఎమ్మెల్యే బాలునాయక్

    • కులం, హోదాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలి: బాలునాయక్

    • ప్రతిపక్షాల కుట్రను సొంత పార్టీ నేతలు అమలు చేస్తున్నారు: బాలునాయక్

  • Aug 21, 2026 12:47 IST

    హైదరాబాద్: సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదని ఎలా అంటారు?: ప్రభుత్వ విప్ వీరేశం

    • సురేఖ భాష ఎప్పుడూ పార్టీని ఇబ్బంది పెడుతోంది: వేముల వీరేశం

    • నటి విషయంలోనూ కొండా సురేఖ ఇలానే మాట్లాడారు: వీరేశం

    • మీ తప్పుడు భాషకు సీఎం మూల్యం చెల్లించాలా?: వీరేశం

    • మీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పార్టీ బలి కావాలా?: వీరేశం

    • సీఎం రేవంత్‌ను బలహీనపరచాలని కుట్ర చేస్తున్నారు: వీరేశం

    • సీఎంపై ఎవరు తప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాలి: వీరేశం

    • కొండా అంశంపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలి: వీరేశం

  • Aug 21, 2026 12:46 IST

    హైదరాబాద్: కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

    • సీఎంపై విపక్ష నేతలు విమర్శలు చేస్తే అర్థం చేసుకోవచ్చు.. కానీ సొంత పార్టీ నేతలే ప్రతిపక్షంలా మాట్లాడితే ఎలా?: బీర్ల ఐలయ్య

    • సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ స్పందించాలి: బీర్ల ఐలయ్య

    • ముఖ్యమంత్రికి మేమంతా అండగా ఉన్నాం: బీర్ల ఐలయ్య

    • సీఎంపై ఎవరు విమర్శలు చేసినా ఊరుకోం: బీర్ల ఐలయ్య

  • Aug 21, 2026 12:43 IST

    హైదరాబాద్: కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

    • కాంగ్రెస్ బీఫామ్‌పై గెలిచిన సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

    • కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదని ఎలా అంటారు?: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

    • కుమార్తె మాట్లాడితే మంత్రిగా ఉన్న తల్లికి సంబంధం ఉండదా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

    • సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించాల్సిందే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

    • సీఎం రేవంత్‌పై సుస్మిత విమర్శలను ఖండించాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

  • Aug 21, 2026 12:07 IST

    అమరావతి: SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి ముందడుగు

    • SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తి

    • ఐనవోలులో 2.05 ఎకరాల్లో SBI నివాస సముదాయ నిర్మాణం

    • రూ.214 కోట్లతో SBI హౌసింగ్ ప్రాజెక్టు

    • 2028లోపు నివాస సముదాయం పూర్తి చేయాలని లక్ష్యం

  • Aug 21, 2026 12:05 IST

    హైదరాబాద్: రాజేంద్రనగర్ TGIRDలో ఎల్‌నినోపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్

    • పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి, అధికారులు

    • ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

    • వీబీ-జీ రామ్‌జీ ద్వారా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ

  • Aug 21, 2026 12:03 IST

    రాజస్థాన్: జైపూర్‌లో సీజేపీ నేత అశుతోష్ రాంకా బృందంపై దాడి

    • ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి తెలుసుకునేందుకు వచ్చిన సీజేపీ బృందం

    • ప్రభుత్వ పాఠశాలలు సందర్శించకుండా అడ్డుకున్న స్థానికులు

    • స్కూళ్లను పశువుల దొడ్లో నిర్వహిస్తున్నారని అశుతోష్ ఆరోపణ

    • తమపై బీజేపీ గూండాలు దాడి చేశారని ఆరోపిస్తున్న అశుతోష్

    • ఇప్పటికే అనధికారిక వ్యక్తులు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి ఫొటోలు, వీడియోలు తీయడంపై రాజస్థాన్ ప్రభుత్వం ఆంక్షలు

  • Aug 21, 2026 12:01 IST

    ఢిల్లీ: కరోల్‌బాగ్‌లో భారీ చోరీ

    • పార్క్ చేసిన కారు నుంచి రూ.2కోట్ల విలువైన ఆభరణాల చోరీ

    • జైపూర్ నుంచి ఆభరణాలు తీసుకొచ్చిన వ్యాపారులు

  • Aug 21, 2026 11:56 IST

    తూ.గో.: డాక్టర్ ప్రియాంక కేసులో నిందితుల కస్టడీ పూర్తి

    • నిందితులను రెండు రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు

    • వైద్య పరీక్షల తర్వాత రాజమండ్రి జైలుకు నిందితుల తరలింపు

    • ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో కీలక ఆధారాలు సేకరణ

  • Aug 21, 2026 11:51 IST

    అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం

    • కూలిపోయిన ఓ చార్టర్ విమానం

    • పశ్చిమ అలాస్కాలోని మారుమూల ప్రాంతంలో కుప్పకూలిన విమానం

    • ప్రమాదంలో 8 మంది మృతిచెందినట్లు వెల్లడించిన అమెరికా సైన్యం

  • Aug 21, 2026 10:45 IST

    వేలంలో భారీ ధర పలికిన ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సి జెర్సీ

    • ధర రూ.56 లక్షలు పలికిన మెస్సి జెర్సీ

    • 2012లో బార్సిలోనా-మాంఛెస్టర్‌ మ్యాచ్‌లో ఈ జెర్సీ ధరించిన మెస్సి

    • మాంఛెస్టర్‌ యునైటెడ్‌ మసాజ్‌ థెరిపిస్ట్‌ రోడ్‌ థార్నీ కలెక్షన్‌ వేలం

  • Aug 21, 2026 10:34 IST

    హైదరాబాద్: అమీర్‌పేట్‌లో కర్ణాటక ప్రీమియం లిక్కర్ పట్టివేత

    • SR నగర్‌లో ఓ వ్యక్తి వద్ద 4 కర్ణాటక ప్రీమియం లిక్కర్ బాటిళ్లు స్వాధీనం

    • విచారణలో గోవర్ధన్‌రెడ్డి నుంచి మద్యం తీసుకున్నట్టు గుర్తింపు

    • గోవర్ధన్‌రెడ్డి ఇంట్లో మరో 51 కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు సీజ్

  • Aug 21, 2026 10:31 IST

    తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు

    • ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి

    • అమెరికా వెళ్లకుండా ఎల్లుండి హైదరాబాద్ రానున్న రేవంత్‌

  • Aug 21, 2026 10:14 IST

    ఏలూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

    • ఎదురెదురుగా ఢీకొన్న రెండు లారీలు

    • జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో ఘటన

    • లారీ డ్రైవర్ మృతి, మరో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు

  • Aug 21, 2026 10:10 IST

    కొమురంభీం: సిర్పూర్(టి)లో పెద్దపులి కలకలం

    • ఇటుకలపహాడ్ అటవీ ప్రాంతంలో లేగ దూడను చంపిన పులి

    • అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లొద్దని అధికారుల నిషేధాజ్ఞలు

  • Aug 21, 2026 10:10 IST

    కాకినాడ: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు

    • నిందితుడు సాదిక్ కోసం పోలీసుల ముమ్మర గాలింపు

    • సాదిక్ ఖాన్‌పై లుకౌట్ నోటీసులు జారీ, పాస్‌పోర్ట్ సీజ్

    • ఏఈ నూకరాజు కుమార్తె మృతదేహం లభ్యం

    • నూకరాజు భార్య కోసం గోదావరిలో కొనసాగుతున్న గాలింపు

  • Aug 21, 2026 10:09 IST

    హైదరాబాద్: కొండా సురేఖ ఎపిసోడ్‌పై కాంగ్రెస్ సీరియస్

    • క్రమశిక్షణ కమిటీకి సురేఖ ఇచ్చిన వివరణపై అసంతృప్తి

    • కుమార్తె చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదన్న సురేఖ

    • సుస్మిత వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయకపోవడం సరికాదన్న నేతలు

  • Aug 21, 2026 09:45 IST

    కాకినాడ: అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ

    • అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి

    • స్త్రీ శక్తి పథకం అమలుపై హర్షం వ్యక్తం చేసిన మహిళలు

    • బస్టాండ్‌లో మౌలిక వసతులపై ఆరా తీసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

    • ఆర్టీసీ క్యాంటీన్‌లో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేసిన మంత్రి

  • Aug 21, 2026 09:44 IST

    కామారెడ్డి: ఎస్పీ ఆఫీసుకు కూతవేటు దూరంలో భారీ చోరీ

    • వైఎన్ కాలనీలో మూడు ఇళ్లలో చోరీ

    • ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనం చేసిన దొంగలు

    • సీసీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Aug 21, 2026 09:30 IST

    కొమురంభీం: కాగజ్‌నగర్‌లో కూరగాయల విక్రయాలపై వివాదం

    • సర్ సిల్క్ ఏరియాలో కూరగాయలు విక్రయించవద్దని మున్సిపల్ అధికారుల ఆదేశం

    • పాత మార్కెట్‌లోనే అమ్ముకోవాలని సూచన

    • పాత మార్కెట్‌కు వెళ్లబోమంటున్న వ్యాపారులు

    • కూరగాయలు రోడ్డుపై పడేసి ఆందోళన

  • Aug 21, 2026 08:08 IST

    హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో యువతి ఆత్మహత్య

    • ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో యామిని (24) ఉరివేసుకుని ఆత్మహత్య

    • ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు

    • మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 21, 2026 08:07 IST

    విశాఖపట్నం: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

    • నిందితుడి నుంచి 23.5 తులాల బంగారం స్వాధీనం

    • నిందితుడిపై హైదరాబాద్, ముంబైలో పలు కేసులు

  • Aug 21, 2026 07:38 IST

    హైదరాబాద్‌: నేటి నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సమీక్షలు

    • కలెక్టర్లు, RDOవోలు, తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి సమీక్షలు

    • ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలపై నేరుగా ఆరా

    • ఇందిరమ్మ ఇళ్లు, హౌసింగ్ పథకాల అమలుపైనా సమీక్ష

  • Aug 21, 2026 07:37 IST

    హైదరాబాద్‌: కాంగ్రెస్ నేత కోటూరి మానవతారాయ్‌కి నోటీసులు

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు రావాలని సిట్‌ నోటీసులు

  • Aug 21, 2026 07:36 IST

    పంజాబ్‌: మొహాలీలో కూలిన నిర్మాణంలోని ఆస్పత్రి భవనం

    • ఇద్దరు కార్మికుల మృతి, మరొకరికి తీవ్రగాయాలు

  • Aug 21, 2026 07:35 IST

    బ్రిటన్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

    • నేడు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించనున్న సీఎం

  • Aug 21, 2026 07:35 IST

    నల్లగొండ: రూపా రెడ్డి హత్యపై ఉపాధ్యాయ సంఘాల సీరియస్‌

    • నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్‌ బంద్‌కు ట్రస్మా పిలుపు

    • ప్రిన్సిపాల్ రూపా రెడ్డిని విద్యార్థులే హత్య చేయడంపై ఆగ్రహం

  • Aug 21, 2026 07:34 IST

    ఎన్టీఆర్‌ జిల్లా: కొండపల్లి ఖిల్లాపై అదృశ్యమైన యువకులు క్షేమం

    • ట్రెక్కింగ్‌కు వెళ్లి దారి తప్పిన నలుగురు యువకులు

    • అడవి నుంచి యువకులను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులు

  • Aug 21, 2026 07:31 IST

    తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు

    • రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో 10 చోట్ల సోదాలు

    • వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి నివాసాలు, ఆఫీసుల్లో తనిఖీలు

    • మనీలాండరింగ్, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా